అందమైన వినోదం | Erra cheera movie updates | Sakshi
Sakshi News home page

అందమైన వినోదం

Mar 25 2019 12:35 AM | Updated on Mar 25 2019 1:46 AM

Erra cheera movie updates - Sakshi

బేబి తుషిత

‘మహానటి’ ఫేమ్‌ బేబి తుషిత ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘ఎర్రచీర’. చెరువుపల్లి సుమన్‌ బాబు, ‘శంభో శంకర’ ఫేమ్‌ కారుణ్య, కమల్‌ కామరాజు ముఖ్య తారలుగా నటించనున్నారు. శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై సుమన్‌ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ సినిమా ఏప్రిల్‌ 15 నుంచి తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా సి.హెచ్‌ సుమన్‌ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ సెంటిమెంట్, హారర్‌ నేపథ్యంలోని అందమైన కామెడీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. సినిమాలో ఆద్యంతం సస్పెన్స్‌ కట్టి పడేస్తుంది. కథ, కథనం హైలైట్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ చిత్రానికి సంగీత దర్శకుడు ప్రమోద్‌ సారథ్యంలో రికార్డింగ్‌ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. అలీ, రఘుబాబు, ఉత్తేజ్, మహేష్‌ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం : పమ్రోద్‌ పులిగిల్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తోట సతీష్‌.

Advertisement
 
Advertisement
Advertisement