వైజాగ్‌లో యాక్షన్ | Energetic star Ram's Action Entertainer Movie | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో యాక్షన్

Jun 12 2016 11:28 PM | Updated on Aug 17 2018 2:24 PM

వైజాగ్‌లో యాక్షన్ - Sakshi

వైజాగ్‌లో యాక్షన్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ‘కందిరీగ’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్...

ఎనర్జిటిక్ స్టార్ రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ‘కందిరీగ’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్  రూపొందుతోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను మంగళవారం వైజాగ్‌లో మొదలుపెట్టబోతున్నాం. ఈ నెల 30 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది.

‘కందిరీగ’ తర్వాత రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. తప్పకుండా అందర్నీ అలరించేలా ఉంటుంది. రామ్, రాశీఖన్నా జోడీ కనువిందుగా ఉంటుంది. దసరాకు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి.

Advertisement
 
Advertisement
Advertisement