‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాక్‌! | Emma Roberts Says No To The Rajamouli RRR Movie | Sakshi
Sakshi News home page

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాక్‌!

Jul 28 2019 1:26 PM | Updated on Jul 28 2019 1:26 PM

Emma Roberts Says No To The Rajamouli RRR Movie - Sakshi

దర్శకధీరుడు రాజమౌళిని కష్టాలు వెంటాడుతున్నాయి. బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను మొదలు పెట్టిన రాజమౌళిని వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. హీరోలిద్దరు గాయపడటంతో కొంతకాలం షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. తరువాత ఎన్టీఆర్‌కు జోడిగా నటించాల్సిన డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

ఇటీవల ఎన్టీఆర్‌కు జోడిగా మరో హాలీవుడ్‌ భామ ఎమ్మా రాబర్ట్స్‌ను ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎమ్మా కూడా ఆర్‌ఆర్‌ఆర్‌కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓ రీజినల్‌ సినిమాకు బల్క్‌ డేట్స్‌ ఇచ్చేందుకు ఎమ్మా ఆసక్తి చూపించటం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. దీంతో మరోసారి హీరోయిన్‌ వేటలో పడ్డారు చిత్రయూనిట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement