నడిగర్‌ సంఘం ఎన్నికలకు లైన్‌క్లియర్‌ | Election Commission Given Permission To Nadigar Sangam Elections | Sakshi
Sakshi News home page

నడిగర్‌ సంఘం ఎన్నికలకు లైన్‌క్లియర్‌

Jun 22 2019 10:30 AM | Updated on Jun 22 2019 10:30 AM

Election Commission Given Permission To Nadigar Sangam Elections - Sakshi

తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోరు రచ్చగా మారడంతో పాండవర్‌ జట్టు, స్వామి శంకరదాస్‌ జట్టులు వాగ్యుద్ధానికి దిగాయి. నడిగర్‌ సంఘం ఎన్నికలను నిలిపివేయాలని తమిళనాడులోని ఓ అధికారి మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పాండవర్‌ జట్టు కోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగగా యథాప్రకారం ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరిగేలా తీర్పు వెలువడింది. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరపరాదని షరతు విధించింది. కోర్టు ఆదేశాలతో పాండవర్‌ జట్టు హర్షం వ్యక్తం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement