ఓవర్సీస్లో చిన్నవాడి హవా | Ekkadiki Pothavu Chinnavada Overseas Collections | Sakshi
Sakshi News home page

ఓవర్సీస్లో చిన్నవాడి హవా

Nov 22 2016 1:58 PM | Updated on Sep 4 2017 8:49 PM

ఓవర్సీస్లో చిన్నవాడి హవా

ఓవర్సీస్లో చిన్నవాడి హవా

అసలు థియేటర్ల వరకు జనాలు వస్తారా అనుకుంటున్న సమయంలో రిలీజ్ అయి కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది నిఖిల్ సినిమా. శంకరాభరణం లాంటి డిజాస్టర్ తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా...

అసలు థియేటర్ల వరకు జనాలు వస్తారా అనుకుంటున్న సమయంలో రిలీజ్ అయి కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది నిఖిల్ సినిమా. శంకరాభరణం లాంటి డిజాస్టర్ తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. టైగర్ ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. పోటి కూడా లేకపోవటంతో ఈ చిన్న సినిమాకు కలెక్షన్ల పంట పండుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా ఓవర్సీన్లో మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

ప్రీమియర్ షోలతో 25 వేల డాలర్లు సాధించటంతో ఎక్కడికిపోతావు చిన్నవాడా కలెక్షన్లు జస్ట్ ఓకె అనుకున్నారు. అయితే రిలీజ్ రోజు మాత్రం ఓవర్సీస్లో కూడా దుమ్ముదులిపేసింది ఈ మూవీ. శుక్రవారం 95 వేల డాలర్లు సాధించి నిఖిల్ కెరీర్లోనే ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటికే 2.8 లక్షల డాలర్లు సాధించిన ఈ సినిమా ఈ వారాంతానికి హాఫ్ మిలియన్ మార్క్ రీచ్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement