వెబ్‌లో అడుగేశారు | Eesha Rebba joins Lust Stories Telugu version | Sakshi
Sakshi News home page

వెబ్‌లో అడుగేశారు

Nov 14 2019 1:23 AM | Updated on Nov 14 2019 1:23 AM

Eesha Rebba joins Lust Stories Telugu version - Sakshi

ఈషారెబ్బా

నెట్‌ఫ్లిక్స్‌లో హిట్‌ అయిన హిందీ ఆంథాలజీ (ముగ్గురు లేదా నలుగురు దర్శకులు చిన్న చిన్న కథలను ఓ సినిమాగా రూపొందించడం) ‘లస్ట్‌ స్టోరీస్‌’. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పుడు తెలుగులోనూ ‘లస్ట్‌ స్టోరీస్‌’ను తీసుకురాబోతోంది. ఈ ఆంథాలజీని నందినీ రెడ్డి, తరుణ్‌ భాస్కర్, సంకల్ప్‌ రెడ్డి డైరెక్ట్‌ చే స్తారు. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించే కథలో ఈషారెబ్బా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ పార్ట్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయింది. ఈషారెబ్బాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈషా డిజిటల్‌ ఎంట్రీకి ఇదే తొలి వేదిక కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించే భాగంలో అమలా పాల్‌ నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement