
మగాళ్లే లేని చిత్రం
మగాళ్లే లేని చిత్రంగా ఇనివరుం నాట్కల్ తెరకెక్కుతోంది.
మగాళ్లే లేని చిత్రంగా ఇనివరుం నాట్కల్ తెరకెక్కుతోంది. ఇనియ, ఆర్తి, సుభిక్ష, ఈటన్, అర్చన మొదలగు వారు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి దియూ ముఖ్యపాత్రను పోషించడం విశేషం. మలయాళంలో 30కి పైగా చిత్రాలు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు తులసిదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.జె.డి ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక డాక్యుమెంటరీ చిత్రం రూపొందించడానికి కళాశాల విద్యార్థినులు ఎదుర్కొన్న సంఘటనలు, సమస్యలు సమాహారమే ఇని వరుం నాట్కళ్ చిత్రం అని తెలిపారు.
ఈ చిత్రంలో మగవాళ్లే ఉండరని అన్నారు. చిత్ర షూటింగ్ కంబం, నాగర్‌కోయిల్, తెక్కడి తదితర ప్రాంతాల్లో జరుపుతున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఎంజి శ్రీకుమార్ ఛాయాగ్రహణం సంజీవి శంకర్ అందిస్తున్నారు.