డ్వేన్ బ్రావోతో సోషల్ అవేర్నెస్‌ ఫిలిం | Dwayne Bravo Collaborated With People Media Factory | Sakshi
Sakshi News home page

డ్వేన్ బ్రావోతో సోషల్ అవేర్నెస్‌ ఫిలిం

Aug 3 2019 10:28 AM | Updated on Aug 3 2019 1:34 PM

Dwayne Bravo Collaborated With People Media Factory - Sakshi

ప్రపంచ ప్రఖ్యాత వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావోతో ప్రముఖ నిర్మాణ‌ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోష‌ల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఎంఎల్ఏ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢ‌చారి, ఓబేబి లాంటి వైవిధ్యమైన, విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించి అభిరుచి గ‌ల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

ప్రస్తుతం విక్టరీ వెంక‌టేష్, యువ సామ్రాట్ నాగ చైత‌న్యల క్రేజీ కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్ మూవీ వెంకీ మామ చిత్రాన్ని,  అలాగే అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం అనే అంతర్జాతీయ చిత్రాన్ని కూడా  ఈ సంస్థలో నిర్మిస్తున్నారు.

అయితే... కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాల‌నే స‌దుద్దేశ్యంతో సోష‌ల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు  సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల. ఎ.ఎన్.టి ప్రొడ‌క్షన్స్‌తో క‌లిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా సోష‌ల్ అవేర్నస్‌ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు.

‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్టిండీస్‌ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.  ఈ చిత్రానికి ఆర్తి శ్రీవాత్సవ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.  ఆమె ద‌ర్శక‌త్వం వ‌హించిన ల్యాండ్ ఆఫ్ విడోస్, వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంట‌రీస్ ఇంట‌ర్నేష‌న‌ల్  ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మ‌హిళల‌కు శుభ్రత విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

డ్వేన్ బ్రావో తన అధికారిక  ఫేస్ బుక్ పేజ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్ర విశేషాల‌ను ద‌ర్శకురాలు ఆర్తి శ్రీవాత్సవ తెలియ‌చేస్తూ.. ‘డ్వేన్ బ్రావోతో ఈ సినిమాని రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గ‌ర్వంగాను ఉంది.  జులైలో త‌మిళ‌నాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియ‌లో షూటింగ్ పూర్తయ్యింది. ఆగ‌ష్టులో వెస్టిండీస్‌ లోని ట్రినిడాడ్, టోబాగోల‌లో  షూటింగ్ చేయ‌నున్నాం’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement