దువ్వాడ దుమ్ము లేపుతున్నాడు! | duvvada jagannatham movie shot in hyderabad | Sakshi
Sakshi News home page

దువ్వాడ దుమ్ము లేపుతున్నాడు!

May 17 2017 11:52 PM | Updated on Sep 5 2017 11:22 AM

దువ్వాడ దుమ్ము లేపుతున్నాడు!

దువ్వాడ దుమ్ము లేపుతున్నాడు!

వంటలు చేసే పంతులే కదా... కూరలో కరివేపాకులా ఏరి పారేయొచ్చు! పంచె కట్టుకున్నాడు... మనల్ని చూస్తేనే పరుగులు తీస్తాడు అనుకున్నోళ్లు దువ్వాడ దుమ్ము లేపుతుంటే...

వంటలు చేసే పంతులే కదా... కూరలో కరివేపాకులా ఏరి పారేయొచ్చు! పంచె కట్టుకున్నాడు... మనల్ని చూస్తేనే పరుగులు తీస్తాడు అనుకున్నోళ్లు దువ్వాడ దుమ్ము లేపుతుంటే... అతడికి దూరంగా పరుగులు తీయడానికి దారులు వెతుక్కుంటున్నారు. షూటింగ్‌లో ఈ సీన్‌ చూసినోళ్లు... ‘దువ్వాడ జగన్నాథమ్‌’ క్లైమాక్స్‌లో అల్లు అర్జున్‌ విశ్వరూపం చూపిస్తాడని చెబుతున్నారు.

 హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలోని మేడ్చల్‌లో జరుగుతోంది. క్లైమాక్స్‌ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్‌ కాకుండా, రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉందట! ఓ పక్క షూటింగ్‌ చేస్తూనే, మరోపక్క డబ్బింగ్‌ పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు. రీసెంట్‌గా ఆడియో టీజర్‌ రిలీజ్‌ చేశారు. త్వరలో పాటల్ని విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement