శరణం భజే భజే అంటున్న అల్లు అర్జున్‌ | duvvada jagannatham movie 1st song Saranam Bhaje Bhaje | Sakshi
Sakshi News home page

శరణం భజే భజే అంటున్న అల్లు అర్జున్‌

May 22 2017 6:38 PM | Updated on Sep 5 2017 11:44 AM

శరణం భజే భజే అంటున్న అల్లు అర్జున్‌

శరణం భజే భజే అంటున్న అల్లు అర్జున్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘శరణం భజే భజే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘శరణం భజే భజే’  అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న దువ్వాడ జగన్నాథం చిత్రంలోని తొలి పాటను చిత్ర యూనిట్‌ సోమవారం యూ ట్యూబ్‌లో విడుదల చేసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చాడు.

ఇప్పటికే ఈ సినిమా ఆడియో టీజర్‌ ను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. శరణం భజే భజే పాట యూట్యూబ్‌ లింక్‌ను అల్లు అర్జున్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట... లైక్‌లతో దుమ్ము రేపుతోంది. కాగా  గతంలోనూ డీజే దువ్వాడ జగన్నాథమ్ టీజర్ భారీ స్పందన వచ్చింది. యూట్యూబ్ లో కోటికిపైగా వ్యూస్‌ సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement