కీర్తి ఏమిటో అన్నీ తెలుసు | Duniya Vijay First Wife Commnts On Keerthi | Sakshi
Sakshi News home page

కీర్తి ఏమిటో అన్నీ తెలుసు

Oct 4 2018 11:39 AM | Updated on Oct 4 2018 12:28 PM

Duniya Vijay First Wife Commnts On Keerthi - Sakshi

విజయ్‌ ఏడాదికి ఒకరిని తీసుకువస్తారని ఈమె కూడా అలాగే వచ్చిందని నాగరత్న వెల్లడించారు.

సాక్షి, బెంగళూరు: నటుడు దునియా విజయ్‌ రక్తకన్నీరు సినిమా చూడాలని, ఎవరి జీవితం నాశనమౌతుందో ఈ చిత్రం చూశాకైనా తెలుస్తుందని ఆయన మొదటిభార్య నాగరత్న అన్నారు. ఆయన దగ్గర రక్తకన్నీరు సినిమా సీడీ లేకపోతే తాను ఇస్తానని తెలిపారు. బుధవారం కత్రిగుప్పెలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. తన కుటుంబం వీధిలోకి రావడానికి కారణం కీర్తి అని, ఆమె గురించి తనకు అన్నీ తెలుసని ఎద్దేవా చేశారు. కీర్తి మురికివాడ నుంచి వచ్చిందని, తాను ఇంకా దునియా విజయ్‌కు విడాకులు ఇవ్వలేదని చెప్పారు. విజయ్‌ ఏడాదికి ఒకరిని తీసుకువస్తారని ఈమె కూడా అలాగే వచ్చిందని వెల్లడించారు. ​(చదవండి: నటుడి కాపురంలో చిచ్చు)

విజయ్‌ తల్లికి అనారోగ్యం  
దునియా విజయ్‌ తల్లి అనారోగ్యం బారిన పడగా బుధవారం ఆమె ఒక్కరే ఆటోలో ఆసుపత్రికి వెళ్లారు. దునియా విజయ్‌ నిత్యం వివాదాలతో సతమతం కావడంతో అతడి గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు కలత చెందారు. జిమ్‌ ట్రైనర్‌పై దాడి కేసులో బెయిల్‌పై విడుదలైన దునియా విజయ్‌ రెండవ భార్య కీర్తితో కలిసి విశ్రాంతి తీసుకోవడానికి మడికెరికి వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement