nagaratna
-
అభ్యర్థులపై ఈసీ ఆధారపడితే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవు
న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారు పోటీచేసే అభ్యర్థులపై ఆధారపడితే అవి నిష్పక్షపాతంగా జరుగుతాయని హామీ ఇవ్వలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పేర్కొన్నారు. పట్నాలోని చాణక్య లా యూనివర్సిటీలో రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ లెక్చర్‌లో ఆమె మాట్లాడారు. ఎన్నికలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన వారి స్వతంత్రత గురించి ప్రస్తావించారు. ఎన్నికల సంఘం అత్యున్నత ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థగా 1995 నాటి తీర్పులో సుప్రీంకోర్టు గుర్తించిందని తెలిపారు. ఎన్నికల సమగ్రతను కాపాడే విధిని ఈసీకి అప్పగించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసీ గనక పోటీచేసే అభ్యర్థులపై ఆధారపడితే ఎన్నికలు సజావుగా, తటస్థంగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని భావించలేమన్నారు. ‘‘ఎన్నికల ప్రక్రియపై నియంత్రణ అంటే రాజకీయాలపైనే నియంత్రణ.రాజ్యాంగ నిర్మాణం బలహీనపడితే రాజ్యాంగం కుప్పకూలుతుంది. హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఇది చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన గుణపాఠం. ప్రజాస్వామ్యంలో ఒక సంస్థ మరో సంస్థను నియంత్రించలేని పరిస్థితి ఉన్నప్పుడు వ్యవస్థ కుప్పకూలుతుంది. అలాంటప్పుడు ఎన్నికలు కొనసాగినా, కోర్టులు పనిచేసినా, పార్లమెంట్ చట్టాలను రూపొందించినా అధికారంపై వాస్తవిక నియంత్రణ అంటూ ఉండదు. వ్యవస్థాగత క్రమశిక్షణా ఉండదు’’ అన్నారు. రాష్ట్రాలను సబ్‌ఆర్డినేట్లుగా కాకుండా, కో–ఆర్డినేట్లుగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ నాగరత్న సూచించారు. ‘‘రాష్ట్రాలు కేంద్రం కంటే తక్కువ కాదు. వాటిని కేంద్రంతో సమానంగా పరిగణించాలి’’ అని తేల్చిచెప్పారు. అధికారాల విభజన సమానుల మధ్య రాజ్యాంగం చేసిన ఏర్పాటన్నారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల విషయంలో పార్టీ విభేదాలను పక్కనపెట్టాలని అన్నారు. పరిపాలన అనేది ‘కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది’అనే అంశంపై ఆధారపడకూడదని స్పష్టంచేశారు. -
జేఆర్సీతో పెండింగ్ కేసుల పరిష్కారం
బెంగళూరు: దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న చెప్పారు. కేసుల కొండ కరగాలంటే న్యాయ సంస్కరణల కమిషన్ (జేఆర్సీ) ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవస్థాగతపరమైన కొన్ని లోపాలు కక్షిదారులకు న్యాయం చేకూర్చడంలో జాప్యానికి కారణమవుతున్నాయని అభిప్రాయ పడ్డారు. శనివారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో ‘పెండింగ్ నుండి సత్వర న్యాయం వరకు: భార తీయ న్యాయస్థానాల్లో న్యాయ పంపిణీపై పునరాలోచన’ అనే అంశంపై జస్టిస్ నాగరత్న మాట్లాడారు. న్యాయ సంస్కరణల కమిషన్‌లో కేవలం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులకే కాకుండా జిల్లా కోర్టుల న్యాయమూర్తులు, న్యాయ వాదులకు సభ్యత్వం కల్పించాలని సూచించారు. జాతీయ స్థాయి బార్ అసోసియేషన్ సభ్యులకు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌కు, ప్రభుత్వ ప్రతినిధులకు ఇందులో భాగస్వామ్యం ఉండాలన్నారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేసే బాధ్యతను ఈ కమిషన్‌కు కట్టబెట్టాలని జస్టిస్ నాగరత్న సూచించారు. వాయిదాలకే ప్రాధాన్యం కేసులో యథాతథ స్థితిని విధించడం, విచారణను సుదీర్ఘకాలం వాయిదా వేయడం వంటి కారణాలతో పెండింగ్ కేసులు పెరుగుతున్నాయని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ‘స్టేటస్ కో’తో ప్రయోజనం పొందే కక్షిదారులు కేసు విచారణ వాయిదాపడడానికి మొగ్గు చూపుతున్నారని చెప్పారు. లాయర్లు వాయిదాలను ఇష్టపడుతున్నారని, దానివల్ల వారికి లాభం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రతిసారి విచారణ జరిగినప్పుడల్లా వారికి ఎంతోకొంత ఆదాయం వస్తోందన్నారు. ప్రభుత్వ విభాగాలు ఏదైనా కేసులో ప్రతికూలంగా తీర్పు వస్తే మళ్లీ అప్పీల్‌కు వెళ్తున్నాయని గుర్తుచేశారు. చివరకు కేసులు ఎటూ తేలకుండా పెండింగ్‌లో కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు సత్వర తీర్పు కంటే కేసుల వాయిదాకే ప్రాధాన్యం ఇస్తున్నారని జస్టిస్ నాగరత్నం వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే న్యాయ సంస్కరణల కమిషన్ ద్వారా సంస్థాగతమైన మార్పులు తీసుకురావాలని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే అతిపెద్ద కక్షిదారుగా మారుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారులు సూక్ష్మపరిశీనలను తప్పించుకోవడానికి అప్పీళ్లు దాఖలు చేస్తూ కాలం గడిపేస్తున్నారని తెలిపారు. దీనివల్ల త్వరగా పరిష్కారమయ్యే వివాదాలు ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంటున్నాయని పేర్కొన్నారు. లాయర్లు వృత్తిపరమైన, నైతిక ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జస్టిస్ నాగరత్న పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆచరణీయమైన లిటిగేషన్ పాలసీ తీసుకురావాలన్నారు. నిధులు సకాలంలో ఇవ్వాలని, న్యాయమూర్తుల పోస్టులు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని వెల్లడించారు. -
ఒత్తిళ్లకు జడ్జీలు లొంగిపోకూడదు!
వలస పాలనకు వ్యతిరేకంగా అనేక దశాబ్దాల పోరాటం తర్వాత సాధించు కున్న స్వాతంత్య్రం ఫలితంగా భారత రాజ్యాంగం ఆవిర్భవించింది. రాజ్యాంగ తత్వాన్ని ప్రగాఢంగా గమనిస్తే అది చరిత్రను దృష్టిలో పెట్టుకుని సాగినదిగా తేలుతుంది. రాజ్యాంగం రూపొందుతున్న ప్పుడే అది పరివర్తనీయతను కూడా సంత రించుకుంది. చారిత్రక వారసత్వంగా వస్తున్న రెండు అన్యాయాలను అది చక్క దిద్దింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ప్రాతినిధ్య ప్రజా స్వామ్యం మొదటి రూపాంతరీకరణకు గుర్తుగా నిలిచాయి. మరో విధంగా కూడా రాజ్యాంగం మార్పు తీసుకొచ్చింది. అది సమా జాన్ని పునర్నిర్మించింది. వేళ్లూనుకుని, విస్తరించి ఉన్న కుల, లింగ, వర్గ, జాతి తదితర వివక్షలను రూపుమాపింది. సామాజిక మార్పునకు పురిగొల్పే తత్వందక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని 1996లో రూపొందిస్తున్నప్పుడు ‘పరివర్తనాత్మక రాజ్యాంగవాదం’ అనే పదబంధం పుట్టుకొచ్చింది. కాకతాళీయంగా, ఆ రాజ్యాంగం ఈ ఏడాదితో మూడు దశాబ్దాలను పూర్తి చేసుకుంటోంది. ‘‘చట్టంలో నిర్దేశించిన అహింసాయుత రాజ్యాంగ ప్రక్రియల ద్వారా భారీయెత్తున సామాజిక మార్పునకు పురిగొల్పే సాహసిక తత్వానికి పరివర్తనాత్మక రాజ్యాంగవాదం దర్పణంగా నిలుస్తుంది’’ అని అమెరికన్ విద్యావేత్త కార్ల్ క్లేర్ అంటారు. మన రాజ్యాంగం సరిగ్గా అలాంటిదే. అది 1949 నవంబర్ 26న మనం స్వీకరించినప్పటి నుంచి అలాగే ఉంది.మన రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగాన్ని ఒక సజీవవృక్షంగా భావించారు. అది శాఖోపశాఖలుగా విస్తరిస్తూపోతుంది. తరతరాలుగా అది నిలిచి ఉండాలని వారు కోరుకున్నారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, కోర్టుల ద్వారా మార్పు చోటు చేసుకుంటుందని మనందరికీ తెలిసిందే. సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ అనే మూడు భావనల ద్వారా భారత రాజ్యాంగ పరివర్తనాత్మక దార్శనికతను స్థూలంగా మనం అర్థం చేసుకోవచ్చు. పేదరికం, నిరక్షరాస్యత, అంటరాని తనం, లింగ అసమానతల సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని వలస పాలనానంతర భారత దేశం గుర్తించింది. సామాజిక మార్పునకు చట్టం ముఖ్య ఉత్ప్రేరకంగా ఉంటుందని గుర్తించబట్టే వివక్షకు తావు లేని విధంగా సార్వత్రిక సమానత్వ హక్కులకు రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది.సౌభ్రాతృత్వం గురించి రాజ్యాంగ అవతారికలో స్పష్టంగా ప్రకటించారు. స్వేచ్ఛ, సమానత్వంతోపాటు సౌభ్రాతృత్వం కూడా సమసమాజ సాధనకు ఉపకరణంగా ఉంటుందని వారికి తెలుసు. పక్షపాతాలు, వివక్ష, ఆధిపత్య ధోరణి ఏనాటి నుంచో సమాజంలో ఉన్నవిగా చెప్పి తప్పించుకునే ప్రయత్నానికి అది అడ్డుకట్ట వేసింది. రాజకీయంగా ఒక సమూహంగా నిబద్ధులమై ఉండేందుకు అది సంకేతమిచ్చింది. మత విశ్వాసాలు, గుర్తింపులు, ఆచార విధానాలు ఆధిపత్య ధోరణికి లేదా పౌరులుగా ప్రత్యేక గుర్తింపునకు దారితీయడానికి లేదు. ప్రజాస్వామ్యం, దాని విలువలు మన సమాజంలో వేళ్ళూనుకునేటట్లు చేయడంలో అది గణనీయమైన పాత్ర వహించింది. పార్లమెంట్‌కు ఉన్న పరిధివ్యక్తుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూడటం పరివర్త నాత్మక రాజ్యాంగవాద అత్యంత ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. నచ్చినట్లుగా వ్యవహరించే, ఎంచుకునే, అసమ్మతి వ్యక్తం చేసే స్వేచ్ఛ పౌరులకు ఉంది. సమష్టి లేదా ప్రజాహితం పేరుతో వ్యక్తి గత స్వేచ్ఛను నీరుగార్చకుండా చూసుకోవాలి. అయితే, రూపాంత రీకరణతోపాటు సంయమనం కూడా అవసరం. మార్పు పేరుతో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్నే మార్చేయకూడదు. రాజ్యాంగ పరంగానే అధికారాన్ని చెలాయిస్తున్నప్పటికీ, ఆ అధికారాన్ని వినియోగించడంలో కొన్ని పరిమితులున్నాయని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఈ సిద్ధాంతానికి బీజావాపన స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్ళలోనే పడింది. భూ సంస్కరణలు అమలు జరిపి, జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని పార్లమెంట్ కోరుకున్నప్పుడు, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. రాజ్యాంగంలోని 368వ అధికరణం ప్రాథమిక హక్కులతో సహా వేటికీ మినహాయింపు లేకుండా రాజ్యాంగాన్ని సవరించే హక్కును పార్లమెంటుకు దఖలు పరుస్తోందని శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది. తదనంతరం సజ్జన్ సింగ్ కేసులో కూడా అదే ప్రస్ఫుటమైంది. కాకపోతే, రాజ్యాంగానికి కొన్ని ‘మౌలిక స్వరూప స్వభావాలు ఉన్నా’యని జస్టిస్ ముధోల్కర్ పేర్కొన్నారు. ఆ తర్వాత, 1967లో గోలక్ నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరించడానికి లేదంటూ సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. పార్లమెంట్ (1971లో) 24, 25, 29 సవరణల ద్వారా దాన్ని ఎదిరించే ప్రయత్నం చేసింది. ఈ వివాదం చరిత్రాత్మక కేశవానంద భారతి కేసుగా పరిణమించింది. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉందికానీ, దాని మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది.న్యాయమూర్తుల ధర్మంలిఖిత రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చిన రీతిలో సవరిస్తూపోతే అదొక సాధారణ శాసన రూపంగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అలాగని, అవసరమైనచోట కూడా సవరణలు చేపట్టకపోతే, కాలం చెల్లినదిగా తయారైపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా మౌలిక స్వరూప సిద్ధాంతం రాజ్యాంగం గుర్తింపును పరిరక్షిస్తూనే, అవసరమైన మార్పులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఒక విశిష్టతను సంతరించుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాజ్యాంగాన్ని నీరుగార్చకుండా మౌలిక స్వరూప సిద్ధాంతం కాపాడుతోంది. కానీ న్యాయ సమీక్ష లేకపోతే, మౌలిక స్వరూప సిద్ధాంతం కేవలం నినాదంగా మిగిలిపోతుంది. అధికారాల విభజన, న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ తన పాత్రను నిర్వర్తించగలుగుతుంది. రాజకీయంగా అప్రియమైనవైనా సరే, ఒక చట్టం చెల్లదని చెప్పగలిగే, ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును నిగ్రహించగలిగే స్వతంత్రత జ్యుడీషియరీకి ఉండాలి. అంతిమంగా, న్యాయమూర్తుల విశ్వాసం, తెగువ, స్వాతంత్య్రాలే గణనకు వస్తాయి. జ్యుడీషియల్ ధర్మాన్ని కాపాడతామని జడ్జీలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. వృత్తి జీవితంలో ఎదురుకాగల పర్యవసానాలను లెక్క చేయకుండా న్యాయమూర్తులు ఆ ధర్మాన్ని పరిరక్షించాలి. లేకపోతే, న్యాయ సమీక్ష కేవలం ప్రతీకాత్మకమైనదిగా, వ్యక్తిగతంగా వెనుక ముందు లాలోచించుకుని చేసే పనిగా మిగిలిపోతుంది. న్యాయ పరిరక్షణ నిమిత్తం న్యాయమూర్తులంతా ఏకం కావాలి. ఎప్పుడైతే, స్వాతంత్య్రాన్ని కోల్పోతామో అప్పుడే మనం న్యాయమూర్తులుగా కొనసాగే హక్కును కోల్పోయినట్లు లెక్క. ఎటువంటి ప్రలోభాలకూ లొంగకుండా ‘కుదరదు’ అని చెప్పగలగాలి. రాజకీయ ఒత్తిడి, సంస్థా పరమైన వేధింపులు లేదా పాపులర్ డిమాండ్ల నుంచి జడ్జి స్వేచ్ఛగా వ్యవహరించగలగాలి. ప్రజాస్వామ్యమంటే స్వేచ్ఛకూ, సమానత్వా నికీ అంకితమవ్వడమే! జస్టిస్ బి.వి. నాగరత్న -
స్త్రీ సాధికారతను సానుకూలంగా చూడాలి
ఎంపవర్మెంట్ కుటుంబ బాధ్యతల నుంచి స్త్రీ సాధికారత వరకు, ఆధునిక కాలంలో కుటుంబ బంధాల నుంచి స్త్రీ శక్తి వరకు... జస్టిస్ బీవీ నాగరత్న ఏది మాట్లాడినా... అది ఆణిముత్యమే. ఆత్మావలోకన దృశ్యమే. ఆమె మాటలు స్త్రీ సాధికారత, చైతన్యానికి వెలుగు బాటలు. మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళా విముక్తి... మొదలైన విషయాలపై వివిధ సందర్భాలలో జస్టిస్ బీవీ నాగరత్న వెలువరించిన అభ్రిపాయాలు.→ వివాహం లేదా ప్రసవం తరువాత మహిళలు తమ కెరీర్‌ను వదులుకోకూడదు. ఆర్థిక స్వయంప్రతిపత్తి అనేది మహిళలకు సంబంధించి పఠిష్టమైన భద్రతావలయం.→ పురుషాధిక్య రంగాలలో మహిళల సంఖ్య పెరగడం ‘చొరబాటు’ కాదు. చారిత్రాత్మకంగా వారికి నిరాకరించబడిన స్థలాలను తిరిగి పొందడం.→ ప్రభుత్వ, చట్టపరమైన స్థానాల్లో మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం ఉండాలి.→ భారతదేశంలో మహిళలు ఎదుర్కొనే మొదటి అడ్డంకి... ఆడపిల్లగా పుట్టడమే!→ ఎన్ఎఫ్హెచ్ఎస్–డేటా ప్రకారం 15–19 సంవత్సరాల వయస్సుగల ఆడపిల్లల్లో 59 శాతం మంది తగిన పోషకాహారం లేకుండా, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ఆడపిల్లల అభ్యున్నతికి ఆటంకంగా మారవచ్చు.→ బాలికలపై పెరుగుతున్న డిజిటల్, లైంగిక హింసను నిరోధించడానికి న్యాయ, చట్ట విధానాలను మరింత విస్తరించాలి. 2018–2022ల మధ్య పదివేలకు పైగా కేసులు నమోదైతే వాటిలో శిక్షార్హత రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. సకాలంలో బాధితులకు న్యాయం జరగాలి. పరిహారం అందాలి.→ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ వేగంగా మార్పు చెందుతోంది. ఈ మార్పులు కుటుంబ నిర్మాణాన్ని మాత్రమే కాదు న్యాయవ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చదువు ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం బలపడడం కూడా ఈ మార్పుల్లో ఒకటి. విద్య, ఉపాధి ద్వారా మహిళలు పొందే సామాజిక–ఆర్థిక విముక్తిని సమాజం సానుకూలంగా చూడాలి. ప్రోత్సహించాలి. అలాంటి మహిళలు కుటుంబ శ్రేయస్సుకు మాత్రమే కాదు దేశశ్రేయస్సుకు కూడా దోహదపడతారు.→ కోర్టులలో ఉన్న కుటుంబ వివాదాల్లో ఎక్కువ కేసులు రెండు పార్టీలు రెండు అడుగులు వేస్తే పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలలో ఒకరికొకరు ఆసక్తి, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు భార్యాభర్తలు ఎవరికి వారు అవతలి వ్యక్తి దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. వారి మనసును అర్థం చేసుకోవాలి.→ భార్యాభర్తల మధ్య వివాదాలు పెరగడానికి కారణం మహిళల ఆర్థిక, సామాజిక విముక్తి కాదు. మారుతున్న సామాజిక–ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మన అభి్రపాయాలు, వైఖరులను మార్చుకోకపోవడమే.→ మహిళలకు స్వతంత్రం ఇవ్వండి. సలహాలు, సూచనల నెపంతో వారిని నిరంతరం పర్యవేక్షించకండి. వారు స్వతంత్రంగా ఎదగడాన్ని కోరుకోండి. ఈ దేశ మహిళలందరూ అదే కోరుకుంటున్నారు.→ వీధిలోకి వెళ్లినా, బస్సు లేదా రైల్వేస్టేషన్లో అడుగు పెట్టినా తన భద్రతకు సంబంధించిన ఆలోచనల భారాన్ని స్త్రీ మోయాల్సి ఉంటుంది. ఇల్లు, పని, సమాజంలో తన బాధ్యతలకు సంబంధించిన మానసిక భారానికి ఇది అదనపు భారం. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, బేటీ బచావోలాంటి కార్యక్రమాల ద్వారా గత దశాబ్ద కాలంలో పురోగతి సాధించాం. చెడుకు అడ్డుకట్ట వేసే ప్రతి నివారణ చర్య, రక్షణ వ్యవస్థ హాని చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. బాలికలు అభివృద్ధి చెందడానికి ఒక మార్గాన్ని నిర్మిస్తాయి. -
దయచేసి వీలునామా రాయండి
న్యూఢిల్లీ: భారతీయ స్త్రీలు తమ స్వార్జితాలను తమ తదనంతరం ఎవరికి చెందాలనే విషయంలో కచ్చితంగా వీలునామా రాస్తే ఆయా ఆస్తులపై భవిష్యత్తులో ఎలాంటి వారసత్వ తగాదాలు రాబోవని సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తంచేసింది. ఉన్నత విద్యావంతురాలై కష్టపడి పనిచేసే మహిళలు హఠాత్తుగా భర్త, కుమారులు, కుమార్తెలను కోల్పోతే ఆమె ఆస్తులు అత్తింటి వాళ్లకు చెందుతాయా? పుట్టినింటి వాళ్లకు చెందుతాయా? అనే ప్రశ్న తలెత్తకుండా ఉండేందుకు వీలునామా అనేది చక్కటి పరిష్కారమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. హిందూ వారసత్వ చట్టం, 1956ను అమల్లోకి తెచ్చేనాటికి మన రాజ్యాంగ నిర్మాతలు భారతీయ హిందూ మహిళలు ఒకవేళ పెద్దమొత్తంలో ఆమె పేరిటే ఆస్తిపాస్తులు ఉంటే ఎలా అనే ఆలోచన వచ్చి ఉండకపోవచ్చని అందుకే ఆ నిబంధనలు చట్టంలో లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆస్తుల వారస త్వం విషయంలో తల్లిదండ్రులు, అత్తా మామల మధ్య మనస్పర్థల నివారణకు ఇకనైనా హిందూ మహిళ వీలునామా బాట పట్టాలని ధర్మాసనం సూచించింది. హిందూ మహిళ మరణిస్తే వీలునా మా రాయని పక్షంలో ఆమె పేరిట ఉన్న స్థిరచ రాస్తులన్నీ భర్త తరఫు వారసులకే చెందుతాయంటూ హిందూ వారసత్వచట్టం,1956లోని 15(1) (బి) సెక్షన్లో పేర్కొనడాన్ని న్యాయవాది స్నిధా మెహ్రా కోర్టులో సవాల్‌చేయగా ఈ ప్రజా ప్రయోజనవ్యాజ్యాన్ని బుధవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సెక్షన్ రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణాలను ఉల్లంఘించేదిగా ఉందన్న వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ‘‘ దేశంలోని మహిళలు ముఖ్యంగా హిందు మహిళల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే వీలునామా ఉంటే బాగుంటుందని సూచి స్తున్నాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘వారసత్వం పోరు రాకుండా ఉండాలంటే సంబంధిత మహిళ చనిపోతే వెంటనే తల్లిదండ్రులు, అత్తామామలు రాజీ మార్గాన్ని ఎంచుకోవాలి. మ ధ్య వర్తిత్వంతో తీసుకునే నిర్ణయాన్ని కోర్టు తీర్పుగా మేం గౌరవిస్తాం’’ అని కోర్టు హామీ ఇచ్చింది. -
డీప్‌ఫేక్, ఏఐలతో బాలికలకు వేధింపులు
న్యూఢిల్లీ: డీప్‌ఫేక్, కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత సాంకేతికతతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపుల పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఆదివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు తగిన చట్టాలు అవసరమన్నారు. బాలికలపై జరుగుతున్న ఈ తరహా సాంకేతిక పరమైన దురి్వనియోగాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకునే దిశలో ‘‘ఏఐ సైబర్‌క్రైమ్ అడ్వైజరీ కమిటీ ఆన్ గర్ల్ చైల్డ్’’అనే ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సూచించారు. న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమని పేర్కొన్నారు. లింగ ఆధారిత బ్రూణ, శిశు హత్యలపై ప్రస్తుత చట్టాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. వీటితోపాటు బాలికలకు పోషకాహారం అందించాల్సిన ఆవశ్యకతనూ ఉద్ఘాటించారు. ఆయా అంశాలు అన్నింటిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపునకూ కృషి జరగాలని ఉద్భోదించారు. యూనిసెఫ్ ఇండియాతో కలిసి సుప్రీంకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ (జేజేసీ) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో బాలిక రక్షణ– సురక్షిత, ప్రోత్సాహక వాతావరణం’అనే అంశంపై ఇక్కడ జరిగిన రెండు రోజుల జాతీయ వార్షిక భాగస్వామ్య సదస్సులో జస్టిస్ బీవీ నాగరత్న ముగింపు ఉపన్యాసం చేశారు. జేజేసీ సభ్యులు కూడా అయిన జస్టిస్ నాగరత్న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... → తరచుగా మారుతున్న టెక్నాలజీల వల్ల కలిగే ప్రమాదాలు.. నిరంతరం తలపై వేలాడుతున్న ఖడ్గం లాంటిది. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్, ఏఐ ఆధారిత టెక్నాలజీల ద్వారా బాలల హక్కులు దురి్వనియోగం కాకుండా తగిన చట్టాలను రూపొందించాలి. ఆయా అంశాలపై 24 గంటల సమాచారం వ్యవస్థ, నిరంతరం స్పందించే జాతీయ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలి. → చట్టం ఒక్కటే సమాజాన్ని మార్చలేదు. తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. బాలిక భారమనే అపోహను తొలగించే దిశలోకి తల్లిదండ్రుల దృక్పథం మారాలి. → బాలికను కాపాడటం అంటే తరతరాలను కాపాడడమంటూ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయం హర్షణీయం. → ఆహారమే ఉత్తమ ఔషధం అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పిల్లలలో పోషకాహారంపై అవగాహన పెంచడానికి పాఠశాల సిలబస్‌లో పోషకాహార విద్యను చేర్చాలి. పాఠశాలల చుట్టూ జంక్‌ఫుడ్ ప్రకటనలను నిషేధించాలి. → బాలికల అక్రమ రవాణా నిరోధక చర్యలు మరింత ఫలప్రదం కావాలంటే ఆయా నేరాలకు సంబంధించిన దర్యాప్తును ఫోరెన్సిక్, ఫైనాన్షియల్ ట్రేసింగ్‌తో అనుసంధానించి ప్రొఫెషనల్‌గా నిర్వహించాలి. అలాంటి బాలికల పునరావాసాన్ని ప్రభుత్వ బాధ్యతగా వ్యవస్థ పటిష్టం కావాలి. ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించే వ్యవస్థను నెలకొల్పాలి. → బాధితుల సమస్యల పరిష్కారంపైనే దృష్టి కేంద్రీకరించే విధంగా ప్రతి జిల్లాలో పిల్లలకు, మహిళలకు వైద్య, మానసిక, న్యాయ సేవలు అందుబాటులో ఉండాలి. → పోలీసులకు, న్యాయ వ్యవస్థ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం, విభాగాల మధ్య సమన్వయం, బాధితుల సంతృప్తి తీరుపై వార్షిక సమీక్ష అవసరం. → అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, వికలాంగుల విభాగాలకు సంబంధించిన బాలికలకు రాజ్యాంగం, అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందాల ప్రకారం తగిన గుర్తింపు ఇవ్వాలి. ఆయా ప్రయోజనాలు వారికి అందేట్లు చూడాలి. → లింగ నిష్పత్తి మెరుగుదల కోసం జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో గణాంకాల ను సమీక్షిస్తూ సంస్థల పనితీరును నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలపై పటిష్ట దర్యాప్తు పద్దతులు లేవు: జస్టిస్ పార్దీవాలా సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా మాట్లాడుతూ క్లిష్టమైన సైబర్ నేరాలను ఎదుర్కొనే దర్యాప్తు విధానాలు దేశంలో సమర్థంగా లేవని అన్నారు. ప్రస్తుత సైబర్ యుగంలో బాలికలు బాధితులుగా మారే ప్రమాదం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలుసహా భారతదేశంలోని అనేక స్థానిక తెగలలో బాలిక పుట్టినప్పుడు సంతోషంగా ఉత్సవాలను జరుపుకుంటారని, అది అందరూ నేర్చుకోవాల్సిన విషయమని సూచించారు. -
కొలీజియంలోకి జస్టిస్ నాగరత్న
న్యూఢిల్లీ: మరో రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి రికార్డ్ సృష్టించబోతున్న జస్టిస్ బీవీ నాగరత్న నేడు సుప్రీంకోర్టు కొలీజియంలో లాంఛనంగా సభ్యురాలు కాబోతున్నారు. ఇంతకాలం కొలీజియంలో సభ్యునిగా ఉన్న సుప్రీంకోర్టు మరో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా శుక్రవారం పదవీవిమరణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఐదో సీనియర్ మోస్ట్ జడ్జి అయిన జస్టిస్ నాగరత్న మే 25వ తేదీ నుంచి అధికారికంగా సుప్రీంకోర్టు కొలీజియంలో కొనసాగనున్నారు. 2027 అక్టోబర్ 29వ తేదీదాకా ఆమె ఈ కొలీజియంలో కొనసాగుతారు. ఈలోపు అంటే 2027 సెపె్టంబర్ 23వ తేదీన అత్యంత సీనియర్ మోస్ట్ జడ్జి అర్హతతో ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఈమె 1989లో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన మాజీ సీజేఐ జస్టిస్ ఇ. సీతారామయ్య వెంకటరామయ్య కుమార్తె. జస్టిస్ నాగరత్న చేరికతో కొలీజియం సభ్యుల సంఖ్య ఐదుకు పెరగనుంది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి ఇందులో సభ్యులుగా ఉన్నారు. సోమవారం సీజేఐ కొలీజియంను సమావేశపరిచి సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఖాళీలపై వివరాలు వెల్లడించనున్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. జస్టిస్ అభయ్ ఎస్.ఓకా రిటైర్ అయ్యాక సుప్రీంకోర్టులో మూడు జడ్జీ పోస్టులు ఖాళీ అయ్యాయి. 1993లో కొత్తగా మనుగడలోకి వచ్చిన సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ద్వారానే సుప్రీంకోర్టు, 25 హైకోర్టులకు జడ్జీల ఎంపిక, బదిలీ, పదోన్నతి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. -
జనాభా ఆధారిత పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయమే
న్యూఢిల్లీ: జనాభా గణాంకాల ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పరోక్షంగా సమరి్థంచారు. ఈ విషయంలో దక్షిణ భారత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నట్లు గుర్తుచేశారు. సరోగసీ(క్రమబదీ్ధకరణ) చట్టానికి సంబంధించిన దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. సరోగసీ ద్వారా రెండో సంతానం పొందడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ జంట ఈ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.వి.నాగరత్న స్పందిస్తూ... ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతోంది. కుటుంబాలు కుదించుకుపోతున్నాయి. జననాల సంఖ్య నానాటికీ పడిపోతోంది. దక్షిణాదికి భిన్నంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోతోంది. పిల్లలను కంటూనే ఉన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది ప్రజలకు భావిస్తున్నారు. పార్లమెంట్లో ఉత్తరాది ప్రాధాన్యం మరింత పెరుగుతుందని, దక్షిణాది వాటా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు’’అని వివరించారు. ఇప్పటికే ఒక బిడ్డ ఉండగా, మరో బిడ్డ కోసం ఎందుకు ప్రయతి్నస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించారు. జనాభా తగ్గుదల వల్ల చైనాలో ఎన్నో ప్రతికూల పరిణామాలు సంభవిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితి మన దేశంలో రాదని జస్టిస్ నాగరత్న స్పష్టంచేశారు. ఉత్తరాదిలో జనాభా విపరీతంగా పెరుగుతోందని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవచ్చు కదా! అని పిటిషనర్లకు సూచించారు. విచారణను వాయిదా వేశారు. -
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
బెంగళూరు: భారత సమాజంలో కుటుంబ వ్యవస్థ అనూహ్య మార్పులకు లోనవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. విడాకుల సంఖ్య కొంతకాలంగా క్రమంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘రెండు దశాబ్దాలుగా 25–29 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో అవివాహితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా అమ్మాయిల్లో సగటు వివాహ వయసు కూడా పెరుగుతోంది’’ అని నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ సమాచారాన్ని ఉటంకించారు. సుప్రీంకోర్టులో ఫ్యామిలీ కోర్టుల కమిటీకి చైర్పర్సన్ అయిన ఆమె ‘కుటుంబం: భారతీయ సమాజానికి పునాది’ పేరిట బెంగళూరులో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో మాట్లాడారు. ‘పట్టణీకరణ, మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ విద్య అందుబాటులో రావడం వంటి కారణాలతో కుటుంబాల్లో మార్పులొస్తున్నాయి. విద్య, సాధికారతతో మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక స్వాతం్రత్యాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలి. వారు తమ కుటుంబానికి గాక దేశానికీ ఎనలేని సేవ చేస్తున్నారు’’ అని ఆమె అన్నారు. 40 శాతం పెళ్లిళ్లు విచ్చిన్నం కుటుంబ తగాదాల కేసులు పెరిగిపోతుండటం పట్ల జస్టిస్ నాగరత్న ఆవేనద వెలిబుచ్చారు. అందుకు మహిళలే కారణమన్న వాదనను ఆమె తోసిపుచ్చారు. సమాజ ధోరణి మారకపోవడం వంటివే అందుకు ప్రధానంగా కారణమని అభిప్రాయపడ్డారు. ‘‘సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు మారనప్పుడే వైవాహిక వివాదాలు తలెత్తుతాయి. గత పదేళ్లుగా జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం దాకా విచ్చిన్నమయ్యాయి. ఇంతగా కుటుంబ కలహాల కేసులు వచ్చిపడుతుండటం ఫ్యామిలీ కోర్టులకు తలకు మించిన భారం అవుతోంది. బ్రేక్‌ఫాస్ట్ సరిగా చేయలేదనో, ఫంక్షన్‌కు త్వరగా ముస్తాబు కాలేదనో కూడా కోర్టు దాకా వస్తున్నారు.ఇలాంటి గొడవల వల్ల అంతిమంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. కుటుంబ వివాదాలకు ఫ్యామిలీ కోర్టుల కంటే కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం ఉత్తమం. ఇరుపక్షాలూ సంయమనంతో ప్రయత్నిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ముందు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవాలి. సమస్యను అవతలి వ్యక్తి దృక్కోణం నుంచి చూడాలి. ‘‘భార్య ఏమీ ఆశించకుండా ఇంటిల్లిపాది పనులూ ఒంటిచేత్తో చక్కబెడుతుందని భర్త గుర్తుంచుకోవాలి. ఆమెకు తగిన విలువ ఇస్తే పిల్లలూ మంచి వాతావరణంలో పెరుగుతారు’’ అంటూ హితవు పలికారు. -
దివ్యాంగ చిన్నారులకు శాశ్వత సాయం
న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారులకు జీవితకాలమంతా సాయం అందాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. దివ్యాంగ చిన్నారుల హక్కుల పరిరక్షణపై 9వ వార్షిక జాతీయ సదస్సులో ఆదివారం ఆమె మాట్లాడారు. ‘‘ దేశంలో ఎంతమంది దివ్యాంగ చిన్నారులు అనే కచి్చతమైన గణాంకాలే లేకపోవడం దారుణం. దివ్యాంగ చిన్నారులందరికీ శాశ్వతంగా సహాయం, విద్య అందాలి. మనం చొరవ తీసుకుని వారిని పరిరక్షించలేకపోతే దివ్యాంగ చిన్నారులు నిరాదరణకు గురవుతారు. భిన్న ప్రాంతాల్లోని దివ్యాంగ చిన్నారుల సంక్షేమానికి విభిన్న పద్ధతుల్లో కృషి జరగాలి. అందరినీ ఒకే గాటినకడితే వారిపై వివక్ష చూపినట్లే లెక్క. ఇంతటి కీలక పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు అంగన్వాడీలకు తగు శిక్షణ ఇప్పించి, అక్కడి వనరులను పెంచాలి. నిర్బంధ విద్య అమలు అనే దానిని కేవలం కాగితాలకే పరిమితం చేయకూడదు. కచి్చతంగా దానిని అమలుచేయాలి. తద్వారా ప్రతి ఒక్క దివ్యాంగ విద్యారి్థకి విద్య అందించాలి’’ అన్నారు. దివ్యాంగ చిన్నారులకు పెన్షన్ శాశ్వతంగా అందేలా చూడాలని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్‌కు న్యాయమూర్తి సూచించారు. -
బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?
బిల్కిస్ బానో కేసులో ఖైదీల క్షమాభిక్ష చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దోషులకు క్షమాభిక్ష పెట్టే అర్హత గుజరాత్ సర్కార్‌కు లేదని స్పష్టం చేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థ మీద ఆశలు చిగురించాయి దేశవ్యాప్తంగా సంచనల రేపిన ఈ తీర్పు బాధితురాలితోపాటు, సామాజిక కార్యకర్తలు మహిళాసంఘాలకు, మానవ హక్కుల సంఘాలకు ఊరటనిచ్చింది. మరోవైపు పలువురి పోరాటం,మద్దతు,మీడియా సాధించిన విజయని బిల్కిస్ బానో తరపున పిటీషన్ దాఖలు చేసిన వారు పేర్కొన్నారు. న్యాయం వ్యవస్థపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయని రూప్‌రేఖా వర్మ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు మహిళలు నిరాశ పడకుండా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చిందన్నారు. ఈ కేసులో సర్ఫరోషి ఫౌండేషన్ ఫౌండర్ ప్రముఖ జర్నలిస్టు రేవతి లాల్, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ, కమ్యూనిస్ట్ నాయకురాలు మాజీ ఎంపీ సుభాషిణి అలీ, బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మాజీ ఐపీఎస్ అధికారి మీరన్ చద్దా బోర్వాంకర్ కూడా ఈ మినహాయింపును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ కేసులో ఆదినుంచీ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన బిల్కిస్ బానో, గుజరాత్ కోర్టు తీర్పు తరువాత ఏ మాత్రం ధ్యైర్యాన్ని కోల్పోకుండా, నిరాశ చెందకుండా సుప్రీంకోర్టు గడప తొక్కిన వైనం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. వీరితో పాటు మరోపేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మరెవ్వరో కాదు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించిన జస్టిస్ బీవీ నాగరత్న. ఇంతకీ ఎవరీ నాగరత్న? ఎవరీ జస్టిస్ బీవీ నాగరత్న బిల్కిస్ బానో రేపిస్టులను మళ్లీ జైలుకు పంపిన ఎస్సీ జడ్జి బీవీ నాగరత్న ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసిన రిమిషన్ ఉత్తర్వులను రద్దు చేసిన సుప్రీం న్యాయమూర్తి బీవీ నాగరత్న దోషులు రెండు వారాల్లో లొంగి పొవాలంటూ ఆదేశాలిచ్చి సంచలనం రేపారు. 1962 అక్టోబర్ 30న జన్మించిన జస్టిస్ బెంగుళూరు వెంకటరామయ్య నాగరత్న ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. దివంగత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య కుమార్తె.కర్ణాటకకు చెందిన తొలి సుప్రీం న్యాయమూర్తి కూడా. మాండ్య జిల్లా, ఎంగలగుప్పె చత్ర గ్రామానికి చెందిన నాగరత్న న్యూఢిల్లీలోని భారతీయ విద్యాభవన్‌లో విద్యను అభ్యసించారు.1984లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జీసస్ అండ్ మేరీ కళాశాల నుండి BA హిస్టరీ పట్టా తీసుకున్నారు. 1987లో న్యాయ పట్టా పొందారు. న్యాయవాద వృత్తి జస్టిస్ నాగరత్న అక్టోబర్ 28, 1987న కర్ణాటక బార్ కౌన్సిల్లో చేరి న్యాయవాద వృత్తి చేపట్టారు. రాజ్యాంగ, వాణిజ్య, బీమా, సేవ, పరిపాలనా మరియు ప్రజా చట్టం, భూమి మరియు అద్దె చట్టాలు, కుటుంబ చట్టం మరియు మధ్యవర్తిత్వంలో నిపుణత సాధించారు. ఫిబ్రవరి 18, 2008న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగాను, ఫిబ్రవరి 17, 2010న శాశ్వత న్యాయమూర్తిగాను నియమితులయ్యారు. అనంతరం 2021 ఆగస్టులో భారత సుప్రీంకోర్టుకు నియమితులయ్యారు. జస్టిస్ నాగరత్న2027, సెప్టెంబరులో కేవలం 36 రోజుల వ్యవధిలో భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (CJI) కావాల్సి ఉంది. కీలక తీర్పులు కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి పలు కీలక తీర్పులను వెలువరించిన నాగరత్నం 2012లో ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రసార మాధ్యమాలను నియంత్రించేందుకు స్వయం ప్రతిపత్తి, చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరిన ఆమెకే దక్కింది. నోట్ల రుద్దు చట్ట విరుద్ధం: ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, నోట్ల రద్దుపై ఆమె అభిప్రాయాలు ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన అత్యంత ప్రముఖమైనదిగా పేరొంది. 2016 నవంబరు నాటి నోట్ల రద్దు నిర్ణయంపై, సుప్రీంకోర్టు బెంచ్‌లోని ఇతర నలుగురు న్యాయమూర్తులు డీమానిటైజేషన్ సమర్థించగా మెజారిటీ అభిప్రాయానికి భిన్నంగా జస్టిస్ నాగరత్న అది సదుద్దేశంతో కూడుకున్నదే కానీ చట్టవిరుద్ధని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయడం కంటే దానిని అమలు చేయడానికి శాసన ప్రక్రియను అనుసరించాల్సి ఉందని చెప్పారు. 2019 తీర్పులో, జస్టిస్ నాగరత్న దేవాలయం వాణిజ్య సంస్థ కాదంటూ మరోసాహసోపేత తీర్పును వెలువరించారు. దాని ఉద్యోగులు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం గ్రాట్యుటీకి అర్హులు కాదని, అయితే కర్ణాటక హిందూ మతపరమైన సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా చట్టం ప్రకారం ఇలాంటి ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది. కర్నాటక హైకోర్టులో 2021లో పోక్సో చట్టంపై ఇచ్చిన తీర్పు గురించి కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ చట్టంలోని సెక్షన్ 35లో పేర్కొన్న ఆదేశాన్ని పూర్తి కాని పక్షంలో నిందితులకు బెయిల్‌పై హక్కు ఉండదని జస్టిస్‌లు బీవీ నాగరత్న , ఎంజి ఉమతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. అంటే కేసును మొదట గుర్తించినప్పటి నుండి ఒక సంవత్సరంలోపు విచారణను ముగించాలి. పిల్లల ప్రమేయం ఉన్నట్లయితే, నేరాన్ని అంగీకరించిన 30 రోజులలోపు కోర్టు వారి సాక్ష్యాలను నమోదు చేయాలి. ఏవైనా జాప్యాలు జరిగితే వాటిని వ్రాతపూర్వకంగా రికార్డు చేయాలని కూడా స్పష్టం చేశారు. బిల్కిస్ బానో కేసు 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లలో సమయంలో బిల్కిస్ బానోపై ఇంట్లోకి చొరబడిన పలువురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలు నమోదైనాయి. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానో మూడేళ్ల కూతురితో పాటు ఇంట్లో అందరినీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఈ కేసులో మొత్తం పదకొండు మంది దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తరువాత ఈ తీర్పుపై నిందితులు అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్షగా మారింది. అయితే గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున సత్ ప్రవర్తన, 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్నారంటూ క్షమాభిక్షపేరుతో విడుదల చేసింది. దీంతో దిగ్భాంతికి గురైన బిల్కిస్ బానో తిరిగి సుప్రీను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు. ఈక్రమంలో జస్టిస్ నాగరత్న గుజరాత్ ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు. దోషుల క్షమాభిక్షను రద్దు చేశారు. -
వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో... సుప్రీం భిన్న తీర్పులు
న్యూఢిల్లీ: గర్భ విచ్చిత్తికి సంబంధించిన ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. సుప్రీం కోర్టులో ద్విసభ్య బెంచ్ బుధవారం భిన్న తీర్పుల్ని వెలువరించింది ఒక వివాహిత గర్భం దాలి్చన 26 వారాలకు గర్భవిచ్చిత్తి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఎయిమ్స్ ఇచి్చన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు బెంచ్‌లోని న్యాయమూర్తి జస్టిస్ హిమ కొహ్లి పిండం గుండె ఆపేయాలని ఏ కోర్టు అయినా ఎందుకు చెబుతుందని ప్రశి్నస్తూ గర్భవిచ్ఛిత్తికి నిరాకరించారు. సుప్రీం బెంచ్‌లో మరో న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న దాంతో విభేదించారు. మహిళ నిర్ణయాన్ని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. వివరాల్లోకి వెళితే........ ఇద్దరు పిల్లలున్న ఒక వివాహిత మూడోసారి గర్భం దాల్చింది. అప్పటికే కుంగుబాటు సమస్యతో బాధపడుతున్న ఆమె మానసికంగా, ఆర్థికంగా తాను మరో పిల్లని పెంచడానికి సంసిద్ధంగా లేనని, అందుకే గర్భవిచ్చిత్తికి అనుమతినివ్వాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గర్భం దాల్చి 26 వారాల కావడంతో ఎయిమ్స్‌లో వైద్యులు ఆమెని పరీక్షించి అబార్షన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అక్టోబర్ 6న నివేదిక కూడా ఇచ్చారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ అక్టోబర్ 9న తీర్పు చెప్పింది.ఆ మహిళకు అబార్షన్ చేయాలని ఎయిమ్స్ వైద్యాధికారుల్ని ఆదేశించింది. అబార్షన్‌కు ముందు ఎయిమ్స్ డాక్టర్లు ఆమెని పరీక్షించి గర్భవిచ్చిన్నం చేసినా శిశువు సజీవంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతూ మరో నివేదిక ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గర్భవిచ్చిత్తి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అక్టోబర్ 10న మరో పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా బుధవారం ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం బెంచ్ తొలుత ఎయిమ్స్‌లో మరో వైద్య బృందం గర్భవిచ్చిత్తి వల్ల వచ్చే ప్రమాదేమేమీ లేదని ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. అక్టోబర్ 6 న అబార్షన్‌కు ప్రమాదం లేదని వైద్యులు ఎందుకు నివేదిక ఇచ్చారు ? ఎందుకు ఆ దాపరికం ? నాలుగు రోజుల్లోనే ఎలా పరిస్థితి మారింది ? అని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిపై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. గర్భ విచ్చిన్నం చేసినా శిశువు బతికే ఉంటుందని అంటే ఏ కోర్టు అయినా పిండం గుండె ఆపేయమని ఎందుకు చెబుతుంది ? అంటూ జస్టిస్ హిమాకొహ్లీ ప్రశ్నించారు. నా వరకు నేనైతే అలాంటి పని చేయలేనన్న జస్టిస్ హిమ గర్భవిచ్చిత్తికి నిరాకరించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుని ప్రస్తావించారు. ఇప్పటికీ ఆ మహిళ గర్భం తీసివేయడం పట్ల సుముఖంగా ఉన్నందున ఆమె నిర్ణయాన్ని గౌరవించాలంటూ గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ తీర్పు చెప్పారు. ఆ మహిళ సామాజిక ఆర్థిక పరిస్థితులతో పాటు ఆమె శారీరక, మానసిక పరిస్థితుల దృష్ట్యా గర్భవిచ్చిత్తి చేయడమే సరైనదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఈ కేసుని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌కు పరిశీలనకు సిఫారసు చేశారు. -
నిసర్గ ప్రభావం తెలంగాణపై ఉంటుందా?
-
చురుగ్గా నైరుతి రుతుపవనాలు
-
హీరో విడాకుల అర్జీ
యశవంతపుర: మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవాలని వివాదాస్పద హీరో దునియా విజయ్ సిద్ధమవుతున్నాడు. నాగరత్న, ఆమె పిల్లలు– దునియా విజయ్, అతని రెండ వభార్య కీర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తుండడం తెలిసిందే. రోజూ తన కుటుంబ గొడవలు వీధినపడడం మంచిది కాదు, నాగరత్నతో తెగతెంపులు చేసుకోవాలని భావించిన దునియా విజయ్ బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. నెల రోజుల నుండి నాగరత్న, పిల్లలతో గలాటాలు జరుగుతుండడంతో విడాకులకు ఇదే అదను అని విజయ్ అనుకున్నాడు. గత రెండేళ్ల క్రితం ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించి విడాకులకు కోర్టుకెళ్లినా, మళ్లీ రాజీకి వచ్చారు. తాజా గొడవలతో విజయ్ మళ్లీ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై నాగరత్న స్పందన తెలియాల్సి ఉంది. -
నాన్న నన్ను కొట్టారు.. హీరో కూతురి ఫిర్యాదు
కర్ణాటక, యశవంతపుర: నటుడు దునియా విజయ్ను వరుస వివాదలు వెంటాడుతున్నాయి. జిమ్ శిక్షకుడు మారుతీగౌడపై దాడి చేసి జైలుకెళ్లి వచ్చిన విజయ్‌పై ఈసారి ఏకంగా కూతురే కేసు పెట్టింది. తనను అసభ్యంగా తిట్టినట్లు విజయ్ కుతూరు మోనిక (14) బెంగళూరు గిరినగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ జైలుకెళ్లిన సమయంలో కూతురు మోనికా తల్లి నాగరత్న జతలో ఉన్నారు. సోమవారం తండ్రి విజయ్ ఇంటికి మోనిక వెళ్లి తనకు చెందిన వస్తువులు, కారు పత్రాలను తీసుకెళ్లారు. అప్పుడు విజయ్ నిన్ను ఎంత బాగా చూసుకున్నా, అయినా అమ్మ వెంట ఉంటావా? అని కోపగించుకుని తిట్టాడు. తనకు కూతురే లేదనుకుంటానని అన్నాడు. తల్లితో కలిసి వెళ్లగా... మళ్లీ కొంతసేపటికి తల్లి నాగరత్నతో కలిసి మోనిక బట్టలు తీసుకురావాలని దునియా ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో విజయ్‌తో పాటు రెండో భార్య కీర్తి గౌడ, హేమంత్, వినోద్, కారుడ్రై వర్ మహ్మద్‌లు తనను తిట్టి, కాళ్లతో తన్ని మారణాయూధాలతో దాడి చేసిన్నట్లు మోనిక గిరినగర పోలీసులకు తండ్రితో పాటు మరో నలుగురిపై ఫిర్యాదు చేసింది. దాడిలో తలకు, చేతికి గాయాలు కావటంతో మోనిక ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన తల్లిని కూడా నోటికొచ్చిన్నట్లు దూషించారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొట్టలేదు: విజయ్ కూతురి ఆరోపణలను విజయ్ ఖండించాడు. మోనికపై చేయి చేసుకోలేదని, దురుద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన్నట్లు వివరణ ఇచ్చాడు. మూడు రోజుల్లో అన్నీ విషయాలను బహిరంగం చేస్తానంటూ తన ఇంటి సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు. సహించను: తల్లి నాగరత్న నేను చచ్చినా పర్వాలేదు. నా పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే సహించను. బట్టలు తీసుకెళ్లటానికి వెళ్లిన కూతురిపై కీర్తి మనుషులు దాడి చేశారు. మోనికకు వైద్య పరీక్షలను నిర్వహించాం. గిరినగర పోలీసు స్టేషన్లో ఐదు మందిపై ఫిర్యాదు చేశాం. -
కీర్తి ఏమిటో అన్నీ తెలుసు
సాక్షి, బెంగళూరు: నటుడు దునియా విజయ్ రక్తకన్నీరు సినిమా చూడాలని, ఎవరి జీవితం నాశనమౌతుందో ఈ చిత్రం చూశాకైనా తెలుస్తుందని ఆయన మొదటిభార్య నాగరత్న అన్నారు. ఆయన దగ్గర రక్తకన్నీరు సినిమా సీడీ లేకపోతే తాను ఇస్తానని తెలిపారు. బుధవారం కత్రిగుప్పెలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. తన కుటుంబం వీధిలోకి రావడానికి కారణం కీర్తి అని, ఆమె గురించి తనకు అన్నీ తెలుసని ఎద్దేవా చేశారు. కీర్తి మురికివాడ నుంచి వచ్చిందని, తాను ఇంకా దునియా విజయ్‌కు విడాకులు ఇవ్వలేదని చెప్పారు. విజయ్ ఏడాదికి ఒకరిని తీసుకువస్తారని ఈమె కూడా అలాగే వచ్చిందని వెల్లడించారు. (చదవండి: నటుడి కాపురంలో చిచ్చు) విజయ్ తల్లికి అనారోగ్యం దునియా విజయ్ తల్లి అనారోగ్యం బారిన పడగా బుధవారం ఆమె ఒక్కరే ఆటోలో ఆసుపత్రికి వెళ్లారు. దునియా విజయ్ నిత్యం వివాదాలతో సతమతం కావడంతో అతడి గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు కలత చెందారు. జిమ్ ట్రైనర్‌పై దాడి కేసులో బెయిల్‌పై విడుదలైన దునియా విజయ్ రెండవ భార్య కీర్తితో కలిసి విశ్రాంతి తీసుకోవడానికి మడికెరికి వెళ్లారు. -
కూతురి మృతదేహంతో మోపెడ్‌పై 30 కి.మీ
తుమకూరు: తీవ్రమైన జ్వరంతో ఓ యువతి మరణించగా మృతదేహాన్ని తరలించేందుకు డబ్బుల్లేక 30 కి.మీ మోపెడ్‌పై తీసుకెళ్లిన ఘటన కర్ణాటకలో జరిగింది. తుమకూరు జిల్లా కోడిగేనహళ్ళి వీరాపుర గ్రామానికి చెందిన రైతు కూలీలు తిమ్మప్ప, గౌరమ్మ దంపతుల కుమార్తె నాగరత్న (25) పుట్టుకతోనే మూగచెవిటి. మూడురోజుల నుంచి ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆదివారం ఓ ఆర్ఎంపీ వైద్యుడి ఆసుపత్రి వద్ద మరణించింది. 108 అంబులెన్సు అందుబాటులో లేకపోగా మృతదేహాన్ని ఆటోలో తరలించేందుకు వారి వద్ద ఉన్న డబ్బులు సరిపోలేదు. దీంతో 30 కి.మీ.ల దూరంలోని ఇంటికి మృతదేహాన్ని మోపెడ్‌పై తీసుకెళ్లినట్లు నాగరత్న తండ్రి తిమ్మప్ప తెలిపాడు.


