ఇండియన్‌ 2లో ఇరుక్కారా?

Dulquer Salman and Simbu in Indian 2 Movie - Sakshi

తెలుగు హిట్‌ ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌ ‘వందా రాజావాదాన్‌ వరువేన్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు శింబు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. మరి శింబు నెక్ట్స్‌ చిత్రం ఏంటీ? అంటే ‘ఇండియన్‌ 2’ అంటున్నారు కోలీవుడ్‌ సినీ వాసులు. కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్వకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఇండియన్‌ 2’. ఇటీవల ఈ సినిమా సెట్‌ వర్క్‌ కూడా స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్‌. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా ఎంపికయ్యారని, మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ఓ కీ రోల్‌ చేయబోతున్నారనీ ప్రచారం సాగుతోంది. ‘ఇండియన్‌ 2’లో శింబు కూడా భాగమయ్యారన్నది తాజా టాక్‌. ఇందులో శింబు స్ట్రిక్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌ చేయబోతున్నారని సమాచారం. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌ కానుందట. మరి.. ఈ సినిమాలో శింబు ఇరుక్కారా (ఉన్నారా)? లేదా? అనేది అప్పుడు తెలిసిపోతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top