ఇంకా రిలీజే కాలేదు.. అప్పుడే సీక్వెల్‌ ఆలోచనలు! | Double Ismart Is Sequel For Ismart Shankar | Sakshi
Sakshi News home page

ఇంకా రిలీజే కాలేదు.. అప్పుడే సీక్వెల్‌ ఆలోచనలు!

Feb 25 2019 6:43 PM | Updated on Feb 25 2019 6:43 PM

Double Ismart Is Sequel For Ismart Shankar - Sakshi

బ్యాడ్‌ టైమ్‌ రన్‌ అవుతోన్న సీనియర్‌ దర్శకులు చాలానే మంది ఉన్నా పూరి జగన్నాద్‌ మాత్రం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. సినిమాల విషయంలో జోరు తగ్గకుండా ఒకదాని వెంట మరోటి పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రామ్‌ హీరోగా ఇస్మార్ట్‌ శంకర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుండగా.. ఈ మూవీ సీక్వెల్‌ పార్ట్‌కు సంబంధించిన టైటిల్‌ను రిజిష్టర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్‌శంకర్‌పై విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే..  డబుల్‌ఇస్మార్ట్‌ అనే సీక్వెల్‌ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్.. పూరి జగన్నాధ్ టాకీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement