దోషం ఎవరికి?

Dosham movie ready for censor - Sakshi

కిషోర్, సన జంటగా నటించిన చిత్రం ‘దోషం’. ‘నాకా.. దేవుడికా..?’ అన్నది ఉపశీర్షిక. రా మూవీ రిక్రియేషన్స్‌ పతాకంపై రఘు గోపసాని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్ర దర్శక–నిర్మాత రఘు గోపసాని మాట్లాడుతూ– ‘‘వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు. మనిషిని పట్టి పీడిస్తున్న దోషాల తలలను కోయడానికి త్రిశూలంగా దూసుకొస్తున్న చిత్రం ‘దోషం’. ఈ చిత్రంలోని నటీనటులు నెల్లూరులోని రామాపురం వాస్తవ్యులు.

అందరూ చక్కగా నటించారు. ప్రవీణ్‌ పున్నూరు విలన్‌గా బాగా నటించాడు. మా సినిమాని ఫిబ్రవరి నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పున్నూరు రాజేష్, వసీమ్, అనిల్‌ డబ్బు, వెన్నెల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గౌతమ్‌ రవిరామ్, కెమెరా:శంకర్‌ కేసరి, సహ నిర్మాతలు: ఒంటేరు మాల్యాద్రి, మోహన్‌ రామచంద్రయ్య, సురేశ్‌ పెంట్యాల, కోటపాటి రుషీల్‌ , డబ్బుగుంట వెంకయ్య.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top