డీజే రిలీజ్ ఎప్పుడంటే..? | Dj Duvvada Jagannadham Release Date | Sakshi
Sakshi News home page

డీజే రిలీజ్ ఎప్పుడంటే..?

Feb 26 2017 10:46 AM | Updated on Sep 5 2017 4:41 AM

డీజే రిలీజ్ ఎప్పుడంటే..?

డీజే రిలీజ్ ఎప్పుడంటే..?

సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా డీజే

సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్. కమర్షియల్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకోవడానికి సినిమాను మంచి టైంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

బన్నీకి బాగా కలిసొచ్చిన సమ్మర్ సీజన్ అయితేనే రిలీజ్కు కరెక్ట్ అని భావిస్తున్నారు. అయితే ఈ సమ్మర్లో భారీ చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. మార్చి నెలాఖరున పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రిలీజ్కు రెడీ అవుతుండగా, ఏప్రిల్ చివర్లో బాహుబలి థియేటర్ల లోకి రానుంది. ఇన్నాళ్లు మహేష్ సినిమా రిలీజ్ విషయంలో ఉన్న అనుమానాలకు తెర దించుతూ దర్శకుడు మురుగదాస్ జూన్ 23న సినిమా రిలీజ్ అంటూ ప్రకటించేశాడు.

మధ్యలో కాలీగా ఉన్న మే నెలలోనే దువ్వాడ జగన్నాథాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. సమ్మర్ సీజన్తో పాటు, మరో భారీ చిత్రం రిలీజ్కు నెల రోజుల గ్యాప్ ఉండటంతో ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నారట. అయితే బాహుబలి అనుకున్నట్టుగా ఏప్రిల్ 28న రిలీజ్ అయితే డీజే.., మే లో థియేటర్లలోకి వస్తుంది. బాహుబలి ఏ మాత్రం ఆలస్యమైనా ఆ తరువాత రిలీజ్ అవ్వబోయే సినిమాల రిలీజ్ డేట్స్లో కూడా మార్పులు కాయం అంటున్నారు విశ్లేషకులు.

Advertisement
 
Advertisement
Advertisement