ప్రతి ఇంటా కాంతులీనే పర్వదినం దీపావళి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకుంటారు. వినోదాన్ని పంచే సినిమా ఈ వేడుకలో భాగంగా మారింది. దీపావళిని దృష్టిలో ఉంచుకునే కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. దీపావళి ప్రతి ఇంటా సంతోషం నింపాలంటోంది శ్రీయ. ఆమె ఇంకా ఏమి చెబుతోందంటే..

పలు భాషలలో నటించారు. నటిగా ఏ భాషలో నటించడం సౌలభ్యంగా అనిపించింది?
నిజం చెప్పాలంటే హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నటించడం సౌకర్యంగా ఉంది. అయితే భాషల్లో భేదం ఉండొచ్చుగానీ భావం ఒక్కటే. నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి అంతే.
మీ చిత్రాలలో మీకు బాగా నచ్చిన పాట ఏది?
మళై చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన నీ వరంబోదు.. అనే పాట అంటే చాలా ఇష్టం. అదే విధంగా ఎ.ఆర్.రెహ్మాన్ బాణీలు కట్టిన శివాజీ చిత్రం లోని ఆంబల్... అనే పాట బాగా ఇష్టం.
రజనీకాంత్ సరసన నటించడం ఎలాంటి అనుభూతి ఇచ్చింది?
నిరాడంబరతకు మారుపేరు రజనీ. ఎక్కడ నుంచి వచ్చామన్న విషయాన్ని మరచిపోకుండా జీవించే అద్భుత మనిషి. మంచికి, మానవత్వానికి చిహ్నం. సూపర్‌స్టార్ అన్న భావన ఆయనలో మచ్చుకైనా కనిపించదు. ఎలాంటి ఈగో లేని వ్యక్తి. నన్ను ఆశ్చర్యపరచిన నటుడు రజనీకాంత్.
పెళ్లెప్పుడు చేసుకుంటారు?
అలాంటి ఒకరోజు కచ్చితంగా వస్తుంది. అయితే అది ఎప్పుడన్నది తెలియదు. అందరికీ తెలిసే నా పెళ్లి జరుగుతుంది. కల్యాణ ఘడియలొచ్చిప్పుడు నా చేతి వేలికి అంగుళీకం ఉంటుంది.
ప్రేమ గురించి మీ భావన?
అది ఒకరి వ్యక్తిగత విషయం. అందులో ఇతరులు తలదూర్చడం దాని గురించి మాట్లాడడం మంచి సంస్కృతి కాదు.
ఈ దీపావళిని ఎక్కడ జరుపుకుంటున్నారు?
ముంబయిలోనే. కుటుంబ సభ్యులు, స్నేహితులు వస్తారు. ఇల్లంతా దీపాల వెలుగులతో కలర్‌ఫుల్‌గా మార్చేస్తాం. స్వీట్స్, నూతన వస్త్రాలు ఇలా ఆనందభరితమైన అంశాలన్నీ ఉంటాయి.