తేజ నెక్ట్స్ సినిమా ఫిక్స్‌! | Director Teja Next Film Confirmed | Sakshi
Sakshi News home page

Jun 29 2018 11:03 AM | Updated on Jun 29 2018 11:03 AM

Director Teja Next Film Confirmed - Sakshi

ఎన్టీఆర్ బయోపిక్‌ నుంచి తప్పుకున్న తరువాత దర్శకుడు తేజ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న తేజ, తరువాత చాలా కాంబినేషన్స్‌ను సెట్ చేసే ప్రయత్నం చేశాడు. వెంకటేష్ హీరోగా ఓ సినిమా అనుకున్నా అది పట్టాలెక్కలేదు. తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌ నుంచి తానే తప్పుకున్నాడు. రానాతో మరో సినిమా అనుకున్నా రానాకు ఖాలీ లేకపోవటంతో కుదరలేదు. దీంతో తేజ మరో సినిమా ఎప్పుడు మొదలు పెడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తాజాగా తేజ కొత్త సినిమాపై మరో వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. తేజ తన తదుపరి చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా కాజల్‌ అగర్వాలే హీరోయిన్‌. అంటే వరుసగా రెండు సినిమాలో ఈ జంట కలిసి నటిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement