సీసీసీకి సంపత్ నంది విరాళం

Director Sampath Nandi Contributes 5 Lakhs For Corona Crisis Charity - Sakshi

కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సహాయం అందించేందుకు ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు దర్శకుడు సంపత్ నంది 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఎవరూ ఊహించని ఉపద్రవం అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయంగా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా 5 లక్షల రూపాయలు సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ త‌మ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని సంపత్ నంది కోరారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top