నా నిజాయితీ రుజువయ్యాకే షూటింగ్‌కి వెళతా! | Director Maruthi's controversial statements about Radha Movie | Sakshi
Sakshi News home page

నా నిజాయితీ రుజువయ్యాకే షూటింగ్‌కి వెళతా!

Feb 10 2014 11:28 PM | Updated on Sep 27 2018 8:49 PM

నా నిజాయితీ రుజువయ్యాకే షూటింగ్‌కి వెళతా! - Sakshi

నా నిజాయితీ రుజువయ్యాకే షూటింగ్‌కి వెళతా!

‘‘నా దగ్గర పదేళ్లకు సరిపడా కథలున్నాయి. ఒకరి కథల్ని కాపీకొట్టాల్సిన అవసరం నాకు లేదు. వేరొకరి కథను దొంగిలించి నేను ‘రాధా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను అనడం

‘‘నా దగ్గర పదేళ్లకు సరిపడా కథలున్నాయి. ఒకరి కథల్ని కాపీకొట్టాల్సిన అవసరం నాకు లేదు. వేరొకరి కథను దొంగిలించి నేను ‘రాధా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను అనడం అవాస్తవం’’ అని మారుతి అన్నారు. వెంకటేష్ కథానాయకునిగా ‘రాధా’ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథపై జరుగుతున్న వివాదాన్ని ఖండిస్తూ సోమవారం ఈ విధంగా స్పందించారు మారుతి. ఇంకా చెబుతూ-‘‘గతంలో ఓ ఎమ్మెల్యే బంధువు వెంకటేష్ గారికి ఇలాంటి కథే ఒకటి వినిపించారు. ఆ కథనే వెంకీ నాతో ‘రాధా’గా తీయిస్తున్నారని సదరు వ్యక్తులు రచయితల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇంతవరకూ వెంకటేష్‌గారికే నేను కథ పూర్తిగా చెప్పలేదు. కథపై నాకే పూర్తిగా క్లారిటీ లేదు. కాపీ కొట్టడానికి ఛాన్సెక్కడిది. ఈ నెల 14న వెంకటేష్‌గారికి కథ చెప్పబోతున్నా. నా ‘రాధా’ కథ.. రచయితల సంఘం పరిశీలనకు వెళ్లింది. నా నిజాయితీ రుజువయ్యాకే షూటింగ్‌కి వెళతా’’ అన్నారు మారుతి. 
 

Advertisement
 
Advertisement
Advertisement