వెంకీని ఇబ్బంది పెడుతోన్న హీరోయిన్ | director maruthis babu bangaram in trouble | Sakshi
Sakshi News home page

వెంకీని ఇబ్బంది పెడుతోన్న హీరోయిన్

May 12 2016 1:04 PM | Updated on Sep 3 2017 11:57 PM

వెంకీని ఇబ్బంది పెడుతోన్న హీరోయిన్

వెంకీని ఇబ్బంది పెడుతోన్న హీరోయిన్

దృశ్యం, గోపాల గోపాల లాంటి హిట్ సినిమాల తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్.., ప్రస్తుతం యువ దర్శకుడు మారుతి డైరెక్షన్లో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్లో...

దృశ్యం, గోపాల గోపాల లాంటి హిట్ సినిమాల తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్.., ప్రస్తుతం యువ దర్శకుడు మారుతి డైరెక్షన్లో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్లో ఎడల్ట్ కామెడీ సినిమాల స్పెషలిస్ట్గా పేరున్న మారుతి, భలే భలే మొగాడివోయ్ సినిమా సక్సెస్తో ఆ ఇమేజ్ను దూరం చేసుకున్నాడు. తొలిసారిగా వెంకటేష్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావటంతో ఆ సినిమాను ఎలాగైన సక్సెస్ చేయాలనే కసితో పని చేస్తున్నాడు.

వెంకీ కూడా బాబు బంగారం సినిమా సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. తన జనరేషన్ హీరో అయినా నాగార్జున భారీ సక్సెస్లు సాధిస్తుండటం, కుర్ర హీరోల నుంచి గట్టి పోటి ఉండటంతో బాబు బంగారం సక్సెస్ వెంకీ కెరీర్కు కీలకం కానుంది. అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూనిట్ను హీరోయిన్ తెగ ఇబ్బంది పెడుతుందట. ఈ సినిమాలో వెంకీ సరసన మూడోసారి జత కడుతున్న నయనతార, సరైన సమయంలో షూటింగ్కు హజరు కాకుండా చిత్రయూనిట్ను ఇబ్బందికి గురి చేస్తోందట.

నయన్ కారణంగా ఇప్పటికే చాలా సార్లు షూటింగ్ ఆలస్యం అయ్యింది. కేవలం నయన్ డేట్స్ అడ్జస్ట్ చేయని కారణంగానే ముందుగా అనుకున్నట్టుగా జూలై 1న సినిమాను రిలీజ్ చేయటం సాధ్ పడటం లేదంటున్నారు చిత్రయూనిట్. అయితే వెంకీకి నయన్ హిట్ పెయిర్ కావటంతో పాటు వెంకీ ఏజ్కు సూట్ అయ్యే స్టార్ హీరోయిన్లు ఎవరు లేకపోవటంతో ఎలాగోలా నయన్తోనే సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement