క్రీడల నేపథ్యంలో...

Dil Raju to present Keerthy Suresh, Aadhi Pinisetty, Jagapathi Babu new movie - Sakshi

కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వంలో క్రీడల నేపథ్యంలో కామెడీచిత్రం తెరకెక్కుతోంది. ‘హైదరాబాద్‌ బ్లూస్, ఇక్బాల్‌’ వంటి చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన హైదరాబాదీ ఫిల్మ్‌మేకర్‌ నగేశ్‌ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. సుధీర్‌ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు సమర్పించనున్నారు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్ట్‌లో చివరి షెడ్యూల్‌ పూర్తిచేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: చిరంతన్‌ భట్, సహ నిర్మాత: శ్రావ్యా వర్మ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top