నా బాయ్‌ఫ్రెండ్‌ను అడిగితే చెబుతాడు! | Did Deepika Padukone just call Ranveer Singh her 'boyfriend'? | Sakshi
Sakshi News home page

నా బాయ్‌ఫ్రెండ్‌ను అడిగితే చెబుతాడు!

Jan 21 2016 10:57 PM | Updated on Sep 3 2017 4:03 PM

నా బాయ్‌ఫ్రెండ్‌ను అడిగితే చెబుతాడు!

నా బాయ్‌ఫ్రెండ్‌ను అడిగితే చెబుతాడు!

మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో దీపికా పదుకొనే నటి స్తూంటే, తాజా ప్రియుడు రణ్‌వీర్ సింగ్‌కు ఎలా ఉంటుంది?

 మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో దీపికా పదుకొనే నటి స్తూంటే, తాజా ప్రియుడు రణ్‌వీర్ సింగ్‌కు ఎలా ఉంటుంది? పుండు మీద కారం చల్లినట్లు ఉంటుందన్నది కొంతమంది ఊహ. అందుకే దీపికా పదుకొనే దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. దీపిక ఏ మాత్రం తడబడకుండా... ‘‘ఈ విషయం గురించి మీరు రణ్‌వీర్‌ను అడిగితే బాగుంటుంది’’ అన్నారు. ‘‘అయినా మనం గతాన్నీ, భవిష్యత్తునూ ఏ మాత్రం దాచకూడదు. ఆ విషయంలో నేనెప్పుడూ క్లారిటీగా ఉంటాను.
 
 మంచీ, చెడు -రెండిటినీ నేను రణ్‌వీర్ సింగ్‌తో పంచుకుంటాను. ఏ బంధమైనా పటిష్ఠంగా ఉండాలంటే.. దాపరికాలు ఉండకూడదు. అందుకే, నేను అన్ని విషయాలనూ రణవీర్‌తో చెప్పేస్తాను’’ అని దీపిక పేర్కొన్నారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ, రణ్‌వీర్ గురించి చెబుతున్నప్పుడు దీపిక ‘నా బాయ్‌ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. ఆ మాట అందరి దృష్టినీ ఆకర్షిం చింది. ఎందుకంటే, ఇప్పటివరకూ ఆమె ఎప్పుడూ అతణ్ణి ‘మంచి ఫ్రెండ్’ అని మాత్రమే చెప్పుకొ చ్చారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ పదం వాడడానికి కారణమేమిటని ఇప్పుడంతా చర్చిస్తున్నారు. బహుశా తమ బంధం గురించి బాహాటంగా ప్రక టించాలని దీపిక అనుకుని ఉంటుందనీ, అందుకే ఇలా క్లూ ఇచ్చారనీ గుసగుస వినిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement