ధనుష్ సినిమా సీక్వల్లో సూపర్ స్టార్ | Dhanush to direct Rajinikanth in Power Pandi 2 | Sakshi
Sakshi News home page

ధనుష్ సినిమా సీక్వల్లో సూపర్ స్టార్

Apr 27 2017 12:55 PM | Updated on Sep 5 2017 9:50 AM

ధనుష్ సినిమా సీక్వల్లో సూపర్ స్టార్

ధనుష్ సినిమా సీక్వల్లో సూపర్ స్టార్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నటుడిగానే కాదు నిర్మాతమగా దర్శకుడిగానూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నిర్మాతగా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నటుడిగానే కాదు నిర్మాతమగా దర్శకుడిగానూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నిర్మాతగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ తాజా పవర్ పాండీ సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ సాధించాడు. వయసు మళ్లిన ఫైట్ మాస్టర్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ కిరణ్, రేవతిలు ప్రధాన పాత్రల్లో నటించారు. పవర్ పాండి సూపర్ హిట్ కావటంతో ఈ సినిమాకు సీక్వల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడు ధనుష్.

అయితే ఈ సీక్వల్లో రజనీకాంత్ను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించిన ధనుష్. తరువాత తన దర్శకత్వంలో రజనీ హీరోగా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే రాజ్ కిరణ్ చేసిన పాత్రలో రజనీ ఎంత వరకు సూట్ అవుతాడన్న అనుమాన్ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.  పవర్ పాండీ తెలుగు రీమేక్ రైట్స్ ను మోహన్ బాబు సొంతం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement