దీపావళి బరిలో ఇద్దరు టాప్‌ స్టార్లు

Dhanush Movie To Clash With Vijay Sarkar - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌, టాప్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం సర్కార్‌. గతంలో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తుపాకి, కత్తి చిత్రాలు ఘనవిజయం సాధించటంతో సర్కార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాతో పోటి పడేందుకు మరో స్టార్ హీరో రెడీ అవుతున్నాడు.

సూర్య హీరోగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్జీకే కూడా దీపావళికే రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావటంతో ఎన్జీకే వాయిదా పడింది. ఇప్పుడు అదే స్థానంలో ధనుష్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కిస్తున్న ‘ఎన్నయ్‌ నొక్కి పాయుమ్‌ తోట్ట’ను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. శశికుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ధనుష్‌ జోడిగా మేగా ఆకాష్‌ నటిస్తున్నారు. ధనుష్‌, విజయ్‌లు ఒకేసారి బాక్సాఫీస్‌ బరిలో దిగుతుండటంతో అభిమానులు దీపావళి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top