అల్లరి డాన్‌ | dhanush maari 2 first look release | Sakshi
Sakshi News home page

అల్లరి డాన్‌

Nov 3 2018 5:29 AM | Updated on Nov 3 2018 5:29 AM

dhanush maari 2 first look release - Sakshi

ధనుష్‌

డాన్‌ అంటే..కత్తి, తుపాకీలను పట్టుకుని రౌడీయిజం చేసి సెటిల్‌మెంట్స్‌ చేస్తుంటారు. కానీ డాన్‌ మారి డిఫరెంట్‌. అల్లరిగా రౌడీయిజం చేసి సమస్యలను పరిష్కరిస్తుంటారు. అదెలా అనేది కొంతవరకు మూడేళ్ల క్రితం వచ్చిన ‘మారి’ సినిమాలో చూశారు. ఇప్పుడు ఫుల్‌గా చూపించడానికి ‘మారి 2’గా వస్తున్నాడు. దర్శక,నిర్మాత, నటుడు ధనుష్‌ హీరోగా బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మారి 2’. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్ర చేసిన ఈ సినిమాకు యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు. 2015లో ధనుష్‌–బా లాజీ మోహన్‌ కాంబినేషన్‌లోనే వచ్చిన ‘మారి’ కి ‘మారి 2’ సీక్వెల్‌. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘అల్లరి డాన్‌ తిరిగొచ్చాడు’’ అన్నా రు ధనుష్‌.   డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement