బాలయ్య సినిమా నుంచి దేవీ శ్రీ అవుట్..? | Devi Sri Prasad Out from Balayya 100th Film | Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమా నుంచి దేవీ శ్రీ అవుట్..?

Aug 10 2016 11:18 AM | Updated on Sep 4 2017 8:43 AM

బాలయ్య సినిమా నుంచి దేవీ శ్రీ అవుట్..?

బాలయ్య సినిమా నుంచి దేవీ శ్రీ అవుట్..?

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా నుంచి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తప్పకున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే మూడు భారీ షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న...

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా నుంచి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తప్పకున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే మూడు భారీ షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా యూనిట్, ప్రస్తుతం దర్శకుడు క్రిష్ పెళ్లి కారణంగా బ్రేక్ తీసుకుంది. అయితే షూటింగ్కు బ్రేక్ ఇచ్చినా..  డబ్బింగ్తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్న బాలయ్య టీం.. దేవీ శ్రీ ప్రసాద్ను త్వరగా పాటలు పూర్తి చేసి ఇవ్వాలని కోరారట. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి హడావిడిగా మ్యూజిక్ చేస్తే చెడ్డ పేరు వస్తుందేమో అన్న అనుమానంతో దేవీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా గౌతమీ పుత్ర శాతకర్ణి టీం నుంచి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తప్పకున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement