మరో భారతీయ కథతో దేవ్ పటేల్ | Dev patel new movie lion trailer | Sakshi
Sakshi News home page

మరో భారతీయ కథతో దేవ్ పటేల్

Aug 27 2016 2:03 PM | Updated on Sep 4 2017 11:10 AM

మరో భారతీయ కథతో దేవ్ పటేల్

మరో భారతీయ కథతో దేవ్ పటేల్

స్లమ్ డాగ్ మిలియనీర్, ద మ్యాన్ హు నో ఇన్ఫినిటీ లాంటి భారతీయ నేపథ్యం ఉన్న చిత్రాలతో ఆకట్టుకున్న బ్రిటీష్ నటుడు దేవ్ పటేల్, మరో భారతీయ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సరూ బ్రియర్లీ అనే వ్యక్తి...

స్లమ్ డాగ్ మిలియనీర్, ద మ్యాన్ హు నో ఇన్ఫినిటీ లాంటి భారతీయ నేపథ్యం ఉన్న చిత్రాలతో ఆకట్టుకున్న బ్రిటీష్ నటుడు దేవ్ పటేల్, మరో భారతీయ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సరూ బ్రియర్లీ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లయన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏ లాంగ్ వే హోం  నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గార్త్ డేవిస్ దర్శకుడు.

కలకత్తా వీదుల్లో తప్పి పోయిన ఓ ఐదేళ్ల కుర్రాడు, ఓ ఆస్ట్రేలియా కుటుంబం చేరదీసే వరకు ఎలాంటి కష్టాలు పడ్డాడు. వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు. 25 ఏళ్ల తరువాత జీవితంలో స్థిరపడిన ఆ యువకుడు తిరిగి తన గతాన్ని గుర్తు చేసుకోని తన కుటుంబం కోసం ఎలాంటి అన్వేషన సాగించాడు అన్న కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్ నటులు నికోలే కిడ్మన్, రూనీ మారా, డేవిడ్ వెన్హామ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement