ప్రేమ గురించి చెప్పమంటే ఎంతసేపైనా ఓపికగా చెప్పేట్లు ఉన్నారు దీపికా పదుకొనె.
రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో పడి, అతన్నుంచి విడిపోయాక రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో పడ్డారీ బ్యూటీ.
సో.. ప్రేమకు సంబంధించి రెండు అనుభవాలు ఉన్నాయి ఆమెకు.
ప్రేమ-పెళ్లి గురించి దీపికాకు కొన్ని అభిప్రాయలున్నాయి.
వాటి గురించి ఈ బ్యూటీ ఏమంటున్నారో తెలుసుకుందాం...
1.
చాలామంది ప్రేమకు డెఫినిషన్ చెప్పవా? అని నన్ను పలు సందర్భాల్లో అడిగారు. అసలు లవ్‌కి డెఫినిషన్ ఉంటుందా? ఒకవేళ ఉంటే దానికి కూడా ప్రేమంటే ఏంటో తెలీదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రేమ ఇలా ఉంటుంది అని విశ్లేషించలేం. ఒక్క మాటలో, ఒక్క పదంలో ప్రేమను నిర్వచించడం చాలా కష్టం. ప్రేమ అంటే ఓ ఫీలింగ్ కాదు. ఒక ఎమోషన్. ఎవరి మీదా ఇష్టం ఒక్కసారిగా పుట్టదు. ఏ ఇద్దరి మధ్య అయినా రోజులు గడిచే కొద్దీ ప్రేమ బలపడుతుంది. ఏ బంధం అయినా నిలబడాలంటే నిజాయతీ, నమ్మకం, ఒకరి మీద ఒకరికి కేరింగ్ ఇవన్నీ కచ్చితంగా ఉండాలి.
2.
ఇప్పటివరకూ జీవితంలో పలు విషయాల్లో కొన్ని ఎదురుదెబ్బలు తిన్నాను. అలాంటివి మళ్లీ రిపీట్ కాకూడదన్నదే నా ప్రయత్నం. ప్రేమలో ఎదురైన చేదు అనుభవం ఇక ఎప్పటికీ ఎదురు కాకూడదని కోరుకుంటున్నా. ఒకసారి తప్పు జరిగిపోయింది.
3.
ఒక వేళ నన్ను ప్రేమిస్తూ ఇంకో అమ్మాయిని కూడా ప్రేమించాడంటే నేను సహించలేను. ఒక వ్యక్తి మనతో జీవితాన్ని పంచుకుంటున్నాడంటే అతని ప్రేమ పూర్తిగా మనకే సొంతం కావాలి. టోటల్‌గా ‘నా వాడు’ అయిపోవాలి. అతని సర్వస్వం నే నే కావాలి. ఏదైనా తేడా వస్తే ఫైట్ చేయడానికైనా రెడీ. అంతే గానీ చూస్తూ మాత్రం ఊరుకోను.
4.
నేను సహజీవనం చేస్తానని, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చాలా మంది వార్తలు పుట్టిస్తున్నారు. అసలు అలాంటివి ఎందుకొస్తున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. నాకు నచ్చితే పెళ్లి చే సుకుంటానే గానీ సహజీవనం మాత్రం చేయను. ఇలా అంటున్నానని నేను సహజీవనానికి వ్యతిరేకిని అనుకోవద్దు. అన్ని రకాల బంధాలను గౌరవిస్తాను. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి జడ్జ్ చేయడానికి మనం ఎవరం? అని నేననుకుంటాను. నేను సామాజికంగా ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా నా మూలాలను మర్చిపోలేను. అందుకే సహజీవనం చేయకూడదని నేను అనుకుంటున్నా.
5.
లవ్ మ్యారేజ్, ఎరేంజ్డ్ ఏదైనా కావచ్చు... జీవితాంతం ఆ బంధం నిలబడాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన ముఖ్యం. నా వైవాహిక జీవితం మాత్రం చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లప్పుడు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని ప్రామిస్ చేసుకుంటాం. ఆ ప్రామిస్‌ని కాపాడుకుంటాను. అవసరమైతే నటనకు గుడ్‌బై చెప్పేసి మరీ నా పర్శనల్ లైఫ్‌ను ఆస్వాదిస్తాను.
అతను టోటల్‌గా ‘నా వాడు’ అయిపోవాలి!
Published Sun, Jan 31 2016 11:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement