రసం, సాంబార్‌ ఇష్టం

deepika padukone Launch Tissot In Tamil Nadu - Sakshi

దక్షిణాదిపై మక్కువ ఎక్కువే

‘టిస్సాట్‌’ రిస్ట్‌వాచ్‌ వేడుకలో నటి దీపికా పదుకొనే

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఉత్తరాదితోపాటూ దక్షిణాది అంటే కూడా మక్కువ ఎక్కువే, ఇక్కడి ప్రజలేకాదు వంటకాలు కూడా ప్రీతికరమైనవేనని బాలివుడ్‌ నటి దీపికాపదుకొనే అన్నారు.సంప్రదాయ చేతిగడియారానికి ప్రసిద్ది చెందిన స్విస్‌ వాచ్‌ ఇండస్ట్రీ వారి కొత్త ఉత్పత్తి ‘టిస్సాట్‌’ రిస్ట్‌వాచ్‌ను శుక్రవారం చెన్నైలో ఆమె ఆవిష్కరించారు. స్విస్‌ బ్రాండ్‌ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దీపిక శుక్రవారం మధ్యాహ్నం చెన్నైకి చేరుకుని వేలాచ్చేరి ఫినిక్స్‌మాల్‌లో స్విచ్‌ వాచ్‌ షోరూంను ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి చెన్నై మీనంబాక్కంలోని ఒక స్టార్‌హోటల్‌కు చేరుకుని టిస్సాట్‌ రిస్ట్‌వాచ్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు, మీడియా వారు అడిగిన అనేక ప్రశ్నలకు సరదాగా జవాబులిస్తూ సందడి చేశారు.

తన వద్ద అనేక వాచ్‌లున్నా స్విస్‌ కంపెనీల వాచ్‌లకు ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. తాజాగా విడుదల చేసిన వాచ్‌లోని అందాలను వర్ణించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్విస్‌ కంపెనీకి ఎంబాసిడర్‌గా ఉండడాన్ని గర్వకారణంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను అడిగిన అనేక ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇటీవల కాలంలో మీకు ఇష్టమైన పాట ఏమిటనే ప్రశ్నకు ఎంతోసేపు ఆలోచించా కొద్దిగా టైమ్‌ ఇవ్వండి ప్లీజ్‌ అంటూ దాటవేశారు. దక్షిణాదిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా, ఇక్కడి ప్రజలు ఎంతో మంచివారు, సంప్రదాయపరులని అన్నారు. చెన్నైకి వచ్చారు కదా ఇక్కడి వంటకాల్లో ఏవంటే ఇష్టమని ప్రశ్నించగా లొట్టలువేస్తున్నట్లుగా ముఖం పెట్టి రసం, సాంబార్‌ అన్నమంటే మక్కువ ఎక్కువేనని బదులిచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top