భూమి ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌ | Deepika makes it to TIME 100 list, Vin Diesel writes inspiring testimony | Sakshi
Sakshi News home page

భూమి ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌

Apr 21 2018 1:16 AM | Updated on Apr 3 2019 6:34 PM

Deepika makes it to TIME 100 list, Vin Diesel writes inspiring testimony - Sakshi

దీపికా పదుకోన్‌

బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా ఉన్నారు దీపికా పదుకోన్‌. గత ఏడాది హాలీవుడ్‌కి కూడా హాయ్‌ చెప్పారీ బ్యూటీ. తాజాగా తన కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌ అందుకున్నారామె. తన నటనతో ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేసిన ఈ బాలీవుడ్‌ బ్యూటీ ఈసారి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వంద మంది ఇన్‌ఫ్లూ్యయన్స్‌ పర్సన్స్‌ (అత్యంత ప్రభావశీలుర జాబితా) లిస్ట్‌లో నిలిచారు. ఓ ప్రముఖ మ్యాగజైన్‌ విడుదల చేసిన ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూ్యయన్సియల్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ ఆఫ్‌ 2018’ లిస్ట్‌లో దీపిక చోటు సంపాదించుకున్నారు. ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఓన్లీ ఇండియన్‌ యాక్టర్‌ దీపికా కావడం విశేషం.

ఆ మ్యాగజైన్‌లో దీపికా ఫ్రొఫైల్‌ను తన హాలీవుడ్‌ ఫస్ట్‌ హీరో, ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ కో–స్టార్‌ విన్‌ డీజిల్‌ రాయడం విశేషం. ‘‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సినిమా టైమ్‌లో దీపికని కలిశా. తను ఓ స్పెషల్‌ పర్సన్‌ అని అప్పుడే నాకు అర్థం అయింది. తన రూమ్‌లోకి ఎంటర్‌ అవగానే ఒక ఎనర్జీ, కెమిస్ట్రీ కనిపిస్తుంది. అనుకోని కారణాల వల్ల తను ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’లో యాక్ట్‌ చేయలేకపోయింది. ‘ట్రిప్లెక్స్‌’లో తనను ఎలాగైనా  క్యాస్ట్‌ చేసుకుందామని  డిసైడ్‌ అయ్యాం.

‘నేను ఈ సినిమాలో యాక్ట్‌ చేయాలంటే నువ్వు ఇండియా రావాలి’ అని డీల్‌ ఫిక్స్‌ చేసిందామె. ఆ డీల్‌ ఒప్పుకొని మంచి పని చేశా. అందరూ దీపిక అందాన్ని, కామెడీ టైమింగ్‌ గురించి మాట్లాడతారు. దీపికా జస్ట్‌ స్టార్‌ మాత్రమే కాదు. యాక్టర్స్‌ యాక్టర్‌. క్రాఫ్ట్‌కి డెడికేట్‌ అయిన ఆర్టిస్ట్‌. ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని మార్కెట్స్‌కు స్టక్‌ అయిపోతుంటారు. బట్‌.. దీపిక కేవలం ఇండియాను రిప్రజెంట్‌ చేయడానికి కాదు.. ఈ ప్రపంచాన్ని రిప్రజెంట్‌ చేయడానికి వచ్చింది. భూమి మనకు అందించిన బెస్ట్‌ గిఫ్ట్‌ దీపిక’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు విన్‌ డీజిల్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement