దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల | dasari narayana rao recovering well, says doctors | Sakshi
Sakshi News home page

దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

Feb 2 2017 6:12 PM | Updated on Sep 5 2017 2:44 AM

దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

కిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగువుతోందని వైద్యులు చెప్పారు.

హైదరాబాద్: కిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు చెప్పారు. దాసరి ఆరోగ్యంపై గురువారం సాయంత్రం కిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

డయాలసిస్ అవసరం లేకుండానే దాసరి చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు చెప్పారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని, మూడు నాలుగు రోజుల్లో సాధారణ పరిస్థితికి వస్తుందని తెలిపారు. వెంటిలేటర్పైనే ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నామని వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ కారణంగా దాసరి కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

(చదవండి: దర్శకుడు దాసరికి అస్వస్థత)

Advertisement
 
Advertisement
Advertisement