తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’ | Darshan, Ambarish, Sneha Starrer Kurukshetram Telugu Trailer | Sakshi
Sakshi News home page

తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’

Jul 25 2019 10:36 AM | Updated on Jul 25 2019 10:36 AM

Darshan, Ambarish, Sneha Starrer Kurukshetram Telugu Trailer - Sakshi

బాహుబలి సినిమా ఘనవిజయం సాధించటంతో ఇతర భాషల్లోనూ భారీ బడ్జెట్‌ చిత్రాలు తెరకెక్కించేందుకు దర్మక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా జానపద పౌరాణిక చిత్రాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే బాటలో కన్నడ నాట తెరకెక్కిన భారీ పౌరాణిక గాథ కురుక్షేత్రం. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాను వృషభాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై మునిరత్న నిర్మిస్తున్నారు. భారీ తారగణం, సెట్స్‌, గ్రాఫిక్స్‌ రూపొందుతున్న ఈ సినిమాకు నాగన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. కురుక్షేత్ర సంగ్రామానికి భీజం వేసిన ఘటనల నేపథ్యంలో ఈ ట్రైలర్‌ను రూపొందించారు. దివంగత నటుడు అంభరీష్ భీష్ముడిగా నటించిన ఈ సినిమాలో దర‍్షన్‌ దుర్యోధనుడిగా కనిపించాడు. కర్ణుడిగా అర్జున్‌, ధర్మరాజుగా శశి కుమార్‌, ద్రౌపదిగా స్నేహా, అర్జునుడిగా సోనూసూద్‌, అభిమన్యుడిగా నిఖిల్‌, శకునిగా రవికుమార్,  కృష్ణుడిగా రవిచంద్రన్‌లు నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement