కామెడీ దెయ్యం కాదు | Darpanam Movie Trailer launch | Sakshi
Sakshi News home page

కామెడీ దెయ్యం కాదు

Mar 26 2019 2:49 AM | Updated on Mar 26 2019 2:49 AM

Darpanam Movie Trailer launch - Sakshi

ఎలక్సియస్, తనిష్క్, శుభాంగి

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్, శుభాంగి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దర్పణం’. రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్, శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్‌ పతాకాలపై క్రాంతికిరణ్‌ వెల్లంకి, వి.ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రామకృష్ణ వెంప మాట్లాడుతూ– ‘‘క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో వినోదం ఉండదు. కామెడీ దెయ్యం సినిమా కాదు. ఇది సస్పెన్స్‌ చిత్రం. లాస్ట్‌ మినిట్‌ వరకు ఏం జరుగుతుందా అనే సస్పెన్స్‌ ఉంటుంది.

కేశవ్‌గారి ద్వారా నాకు పరిచయమయిన క్రాంతిగారు చాలా సహకారం అందించారు’’ అన్నారు. ‘‘ఇది నా మొదటి చిత్రం. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు క్రాంతికిరణ్‌ వెల్లంకి. ‘‘సకల కళావల్లభుడు’ తర్వాత నేను నటించిన చిత్రమిది. ఇందులో థ్రిల్లింగ్, సస్పెన్స్‌ అంశాలు ఎక్కువగా ఉంటాయి’’ అన్నారు తనిష్క్‌రెడ్డి. ‘‘ఈ కథ విన్నప్పుడు సర్‌ప్రైజ్‌ అయ్యాను. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి ఎక్కువ స్కోప్‌ ఉన్న మూవీ ఇది’’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ ముత్యాల.

Advertisement
 
Advertisement
Advertisement