అజిత్‌ ‘విశ్వాసం’ సెట్‌లో విషాదం..! | Dancer Oviyam Sarvanan Died At Viswasam Set | Sakshi
Sakshi News home page

Nov 8 2018 11:40 AM | Updated on Nov 8 2018 11:43 AM

Dancer Oviyam Sarvanan Died At Viswasam Set - Sakshi

‘వీరం’, ‘వేదాలం’, ‘వివేగం’ సినిమాలతో వరుసగా సక్సెస్‌ కొట్టారు అజిత్‌. శివ డైరెక్షన్‌లో హ్యాట్రిక్‌ కొట్టన అజిత్‌.. మరోసారి ‘విశ్వాసం’ తో తన అభిమానులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ షూటింగ్‌ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. ఓ పాటను చిత్రీకరిస్తుండగా విషాదం చోటుచేసుకుంది. 

విశ్వాసంకు సంబంధించిన పాటను షూట్‌ చేస్తుండగా.. డ్యాన్సర్‌ ఓవియన్‌ శరవణన్‌ హఠాత్తుగా మరణించాడు. గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయిన అతన్ని చిత్రయూనిట్‌ ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆయన మృతి చెందాడు. అజిత్‌ తన సొంత ఖర్చులతో మృతదేహాన్ని విమానంలో చెన్నైకి చేరేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆయన కుటుంబానికి తన వంతుగా 8లక్షల ఆర్థిక సహాయాన్నిఅందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement