నాని ప్రమోషనల్ సాంగ్ | D for Dopidi Movie Nani Promotional Song | Sakshi
Sakshi News home page

నాని ప్రమోషనల్ సాంగ్

Oct 29 2013 11:39 PM | Updated on Sep 2 2017 12:06 AM

నాని ప్రమోషనల్ సాంగ్

నాని ప్రమోషనల్ సాంగ్

ఈగ’ సినిమా తర్వాత నేను చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇది. ఈ సినిమాలో నేనిచ్చిన వాయిస్ ఓవర్ తర్వాత వచ్చే సాంగ్ ఇది.

‘‘ ‘ఈగ’ సినిమా తర్వాత నేను చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇది. ఈ సినిమాలో నేనిచ్చిన వాయిస్ ఓవర్ తర్వాత వచ్చే సాంగ్ ఇది. మహేష్ శంకర్ చక్కటి సంగీతం అందించారు’’ అని నాని చెప్పారు. వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేష్, మెలని ముఖ్యతారలుగా సిరాజ్ కల్లా దర్శకత్వంలో రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే నిర్మిస్తున్న ‘డి ఫర్ దోపిడి’ కోసం నానిపై ప్రత్యేకంగా చిత్రీకరించిన ప్రమోషనల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో విడు దల చేశారు. 
 
 ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘బాలీవుడ్‌లో మేం చేసిన ‘గో గోవా గాన్’ చిత్రానికి నృత్యదర్శకత్వం చేసిన ఆదిల్ షేక్ నేతృత్వంలో ఈ ప్రమోషనల్ సాంగ్ చేశాం. ఒక్క రోజులో ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేశామ’’ని తెలిపారు. టైటిల్ సాంగ్‌నే ప్రమోషనల్ సాంగ్‌గా చిత్రీకరించామని దర్శకుడు చెప్పారు. నవంబర్ ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ‘దిల్’ రాజు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement