ఆద్యంతం ఉత్కంఠభరితం | 'cut chesthe' movie release on 7th March | Sakshi
Sakshi News home page

ఆద్యంతం ఉత్కంఠభరితం

Feb 24 2014 11:27 PM | Updated on Sep 2 2017 4:03 AM

ఆద్యంతం ఉత్కంఠభరితం

ఆద్యంతం ఉత్కంఠభరితం

థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కట్ చేస్తే’. సంజయ్, తనిష్క, విజయ్ ఇందులో ప్రధాన పాత్రధారులు. పడాల శివసుబ్రమణ్యం దర్శకుడు.

థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కట్ చేస్తే’. సంజయ్, తనిష్క, విజయ్ ఇందులో ప్రధాన పాత్రధారులు. పడాల శివసుబ్రమణ్యం దర్శకుడు. ఎమ్.ఎస్.కుమార్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ఉత్కంఠకు లోనుచేసే సినిమా ఇది. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు’’ అన్నారు. సినిమా అంటే ఇష్టంతో ఈ రంగంలోకొచ్చానని, తన మనసుకు ఎంతో నచ్చిన కథాంశమిదని నిర్మాత తెలిపారు. వైవిధ్యమైన థ్రిల్లర్ కథాంశమిదని నటుడు విజయ్ చెప్పారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌కుమార్, సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: సంజీవరాణి.
 

Advertisement
 
Advertisement
Advertisement