పిచ్ నుంచి పాటకు..! | cricketer suresh rain sing a song | Sakshi
Sakshi News home page

పిచ్ నుంచి పాటకు..!

Sep 8 2015 10:48 PM | Updated on Sep 3 2017 9:00 AM

పిచ్ నుంచి  పాటకు..!

పిచ్ నుంచి పాటకు..!

క్రికెటర్ సురేశ్ రైనా ఓ రికార్డు సాధించారు. అదేంటి ఏ మ్యాచ్‌లో అనుకుంటున్నారా?

క్రికెటర్ సురేశ్ రైనా ఓ రికార్డు సాధించారు. అదేంటి ఏ మ్యాచ్‌లో అనుకుంటున్నారా? మ్యాచ్‌లో కాదండి! పాట పాడటంలో. ‘మీరుథియా గ్యాంగ్‌స్టర్స్’ చిత్రంలో ‘తూ మిలే సబ్ మిలా’ అనే రొమాంటిక్ సాంగ్‌ను ఆలపించి తనలో మంచి పాటగాడు కూడా ఉన్నాడని నిరూపించాడు సురేశ్ రైనా. ‘‘క్రికెట్  అంటే నాకు ప్రాణం. దీంతో పాటు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం.

అలా నాకు పాడటం వచ్చింది. ఈ సినిమా నిర్మాత  నా భార్యకు బంధువు అవుతారు. ఏదో సందర్భంలో నా గొంతు విని నేను ఈ సినిమాలో పాడాల్సిందే పట్టుబట్టారు. కేవలం అయిదు గంటల్లో రికార్డింగ్ పూర్తయింది. వినేవాళ్లకు నచ్చుతుందనుకుంటున్నా’’ అని సురేశ్‌రైనా  చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement