IPL 2026: చెన్నై సూపర్‌ కింగ్స్‌ చరిత్రలో తొలిసారి ఇలా..! | IPL 2026 CSK VS RR: This is CSK's first ever game without MS Dhoni and Suresh Raina | Sakshi
Sakshi News home page

IPL 2026: చెన్నై సూపర్‌ కింగ్స్‌ చరిత్రలో తొలిసారి ఇలా..!

Mar 30 2026 8:05 PM | Updated on Mar 30 2026 8:12 PM

IPL 2026 CSK VS RR: This is CSK's first ever game without MS Dhoni and Suresh Raina

చెన్నై సూపర్‌ కింగ్స్‌ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ విచిత్రం​ జరిగింది. 277 మ్యాచ్‌ల ఈ ఫ్రాంచైజీ ప్రస్తానంలో తొలిసారి ఓ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని, సురేశ్‌ రైనా ఇ‍ద్దరూ లేరు. సీఎస్‌కే చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇలా జరగలేదు. ఐపీఎల్‌ 2026లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘట్టం చోటు చేసుకుంది. తలా, చిన్న తలా అని పిలుచుకునే ధోని-రైనా లేకపోవడాన్ని సీఎస్‌కే అభిమానులు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.

రైనా కొంతకాలం కిందటే ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. ధోని లీగ్‌లో కొనసాగుతున్నప్పటికీ గాయం కారణంగా ఈ సీజన్‌ తొలి రెండు వారాలకు దూరంగా ఉండనున్నాడు. ధోని-రైనా జోడీ సీఎస్‌కే విజయ ప్రస్తానంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు. ధోని సీఎస్‌కే సాధించిన ప్రతి విజయంలో కీలకంగా వ్యవహరించగా.. రైనా మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరుగడించాడు.

ఇదిలా ఉంటే, రాజస్థాన్‌తో నేటి మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. రాయల్స్‌ పేసర్ల ధాటికి సీఎస్‌కే టాపార్డర్‌ పేకమేడలా కూలింది. నండ్రే బర్గర్‌, జోఫ్రా ఆర్చర్‌ నిప్పులు చెరిగే బంతులతో సీఎస్‌కే బ్యాటర్లను పెవిలియన్‌కు పం​పారు. 

రెండో ఓవర్‌ చివరి బంతికి తొలిసారి సీఎస్‌కే తరఫున ఆడుతున్న సంజూ శాంసన్‌ను (6) బర్గర్‌.. మూడో ఓవర్‌ చివరి బంతికి సీఎస్‌కే సారధి రుతురాజ్‌ గైక్వాడ్‌ను (6) ఆర్చర్‌ అద్భుతమైన బంతులతో క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. 

ఆ మరుసటి బంతికే (3.1 ఓవర్‌) యువ ఆటగాడు ఆయుశ్‌ మాత్రేను బర్గర్‌ మరో అద్భుతమైన బంతితో డకౌట్‌ చేశాడు. ఆతర్వాత వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ వరుసగా బౌండరీ, సిక్సర్‌ బాది జోరును ప్రదర్శిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 36-3గా ఉంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (14), మాథ్యూ షార్ట్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.  

తుది జట్లు..

సీఎస్‌కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: సర్ఫరాజ్‌ ఖాన్‌, ప్రశాంత్‌ వీర్‌, రాహుల్‌ చాహర్‌, గుర్జప్నీత్‌ సింగ్‌, రామకృష్ణ ఘోష్‌

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ

ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: డొనొవన్‌ ఫెరియెరా, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, సుషాంత్‌ మిశ్రా, రవి  సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement