క్రేజీ కాంబినేషన్‌లో... | Crazy Combination .. | Sakshi
Sakshi News home page

క్రేజీ కాంబినేషన్‌లో...

Jul 6 2016 11:48 PM | Updated on Sep 4 2017 4:16 AM

క్రేజీ కాంబినేషన్‌లో...

క్రేజీ కాంబినేషన్‌లో...

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌కు అంకురార్పణ జరిగింది. రవితేజను ‘బెంగాల్ టైగర్’గా బాక్సాఫీస్ పైకి దూకించిన దర్శకుడు ...

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌కు అంకురార్పణ జరిగింది. రవితేజను ‘బెంగాల్ టైగర్’గా బాక్సాఫీస్ పైకి దూకించిన దర్శకుడు సంపత్ నంది, మాస్ హీరో గోపీచంద్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. పుల్లారావు, జె. భగవాన్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘గోపీచంద్‌లో ఉన్న మాస్ యాంగిల్‌ను సరికొత్తగా చూపించబోయే చిత్రమిది. సంపత్ నంది చెప్పిన కథ మాకు బాగా నచ్చింది.


మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అవుతుంది. హై బడ్జెట్‌తో, మంచి టెక్నికల్ వేల్యూస్‌తో సినిమా నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కెమేరా: ఎస్. సౌందర్ రాజన్, ఆర్ట్: ఏయస్ ప్రకాశ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతంరాజు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement