'మొహల్లా అస్సీ' విడుదలపై స్టే | Court stays release of Sunny Deol's 'Mohalla Assi' | Sakshi
Sakshi News home page

'మొహల్లా అస్సీ' విడుదలపై స్టే

Jun 30 2015 8:15 PM | Updated on Sep 3 2017 4:38 AM

'మొహల్లా అస్సీ' విడుదలపై స్టే

'మొహల్లా అస్సీ' విడుదలపై స్టే

కాశీ కా అస్సీ నవల ఆధారంగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రూపొందుతున్న 'మొహల్లా అస్సీ' చిత్రం విడుదలపై సివిల్ కోర్టు స్టే విధించింది.

న్యూఢిల్లీ:కాశీ కా అస్సీ నవల ఆధారంగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రూపొందుతున్న 'మొహల్లా అస్సీ' చిత్రం విడుదలపై సివిల్ కోర్టు స్టే విధించింది.  ఆ చిత్రంలో అసభ్యకరమైన సన్నివేశాలున్నాయన్న ఢిల్లీకి చెందిన గుల్షన్ కుమార్ కోర్టులో పిటిషన్ తో ఏకీభవించిన కోర్టు సినిమా  విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం ఆ చిత్ర విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని పేర్కొంది. ఈ మేరకు చిత్ర ట్ర్రైలర్ ను చూసిన అనంతరం జడ్జి కిషోర్ కుమార్ తన తీర్పును వెలువరించారు. ఒక మతాన్ని కించపరుస్తూ చిత్రంలోని సన్నివేశాలపై కోర్టు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలు తొలగించే వరకూ విడుదలను నిలుపుదల చేయాలని కోర్టు పేర్కొంది.  పరమశివుడ్ని కించపరుస్తూ చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పిటిషనర్ సలహాదారు సచిన్ మిశ్రా తెలిపారు. వారణాసిలో ఉన్న అస్సి ఘాట్ రూపొందిన ఈ చిత్రం జూలై 3 వ తేదీన విడుదల కావాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement