మూడు నెలలు హీరోయిన్ దొరకలేదు: సంపు | could not find heroine for 3 months, says sampoornesh babu | Sakshi
Sakshi News home page

మూడు నెలలు హీరోయిన్ దొరకలేదు: సంపు

Apr 5 2014 3:21 PM | Updated on Sep 2 2017 5:37 AM

మూడు నెలలు హీరోయిన్ దొరకలేదు: సంపు

మూడు నెలలు హీరోయిన్ దొరకలేదు: సంపు

తాను సినిమా చేయడానికి నిర్మాత, దర్శకుడు, కథ.. అన్నీ సిద్ధమైపోయినా మూడు నెలల పాటు హీరోయిన్ దొరకలేదని సంచలన హీరో సంపూర్ణేష్ బాబు తెలిపాడు.

తాను సినిమా చేయడానికి నిర్మాత, దర్శకుడు, కథ.. అన్నీ సిద్ధమైపోయినా మూడు నెలల పాటు హీరోయిన్ దొరకలేదని సంచలన హీరో సంపూర్ణేష్ బాబు తెలిపాడు. 'సాక్షి' కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు.. హృదయ కాలేయం సినిమా ఆలస్యం కావడానికి, దాదాపు ఏడాది పాటు బయటకు రాకపోవడానికి కారణమేంటని ప్రశ్నించినప్పుడు ఈ విషయం బయటపెట్టాడు. నిజానికి తన పక్కన హీరోయిన్గా నటించడానికి ఎవరూ ముందుకు రాలేదని, మూడు నెలల పాటు వెతికి వెతికి, చివరకు తప్పనిసరైతే ఎవరైనా అబ్బాయికే అమ్మాయి వేషం వేయించి అయినా హీరోయిన్గా పెట్టేద్దామని అనుకుంటుండగా ఈ హీరోయిన్ దొరికిందని, దాంతో ఇక అప్పటినుంచి ప్రాజెక్టు వేగం పుంజుకుందని చెప్పాడు.

ప్రేక్షకుల నుంచి ఇంత ఆదరణ లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని, కానీ స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రేక్షక దేవుళ్లు విపరీతంగా ఆదరించారని తెలిపాడు. అమెరికాలో 20 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల చేయగా, అక్కడ కూడా ప్రేక్షకులు ఈలలు వేసి, చప్పట్లు కొట్టినట్లు తెలిసిందని, వాళ్ల అభిమానానికి తాను ఎంతగానో రుణపడి ఉంటానని అన్నాడు. రాబోయే సినిమా 'కొబ్బరిమట్ట'ను కూడా ప్రేక్షకులు ఇదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement