విలన్గా మారుతున్న కమెడియన్ | Sakshi
Sakshi News home page

విలన్గా మారుతున్న కమెడియన్

Published Wed, Oct 5 2016 3:06 PM

విలన్గా మారుతున్న కమెడియన్ - Sakshi

కమెడియన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్, కెరీర్ మంచి ఫాంలో ఉండగానే హీరోగా మారాడు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయినా.. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తన కెరీర్ మరో భారీ మలుపు కు సిద్ధమవుతున్నాడు ఈ నవ్వుల హీరో.

ఇప్పటికే తన కామెడీతో కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన సునీల్, తరువాత హీరోగా మారి సిక్స్ బాడీతో ఆకట్టుకున్నాడు. అదే జోరులో ఇప్పుడు విలన్గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన సునీల్, విలన్గా తెలుగు సినిమా మాత్రం చేయనని తెలిపాడు.

తెలుగులో తనకు కామెడీ ఇమేజ్ ఉందని ఇక్కడ విలన్ పాత్రలో నటిస్తే వర్క్ అవుట్ కాదన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపాడు. వచ్చే ఏడాది సునీల్ విలన్ గా నటించే సినిమా ప్రారంభం కానుంది. సునీల్ హీరోగా వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈడు గోల్డ్ ఎహె సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement