కామెడీ స్పెషలిస్ట్తో కళ్యాణ్ రామ్ | Comedy film director G Nageswar Reddy movie With Kalyan Ram | Sakshi
Sakshi News home page

కామెడీ స్పెషలిస్ట్తో కళ్యాణ్ రామ్

Aug 17 2016 1:20 PM | Updated on Sep 4 2017 9:41 AM

కామెడీ స్పెషలిస్ట్తో కళ్యాణ్ రామ్

కామెడీ స్పెషలిస్ట్తో కళ్యాణ్ రామ్

పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమా కోసం...

పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతో డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్న కళ్యాణ్.. ఆ తరువాత చేయబోయే రెండు సినిమాలను ఫైనల్ చేశాడు. ఇజం సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కిస్తుండగా.. తరువాతి సినిమాలు మాత్రం బయటి నిర్మాతలతో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇజం సినిమా తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు పిల్లా నువ్వులేని జీవితం ఫేం ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాతో పాటు కామెడీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు.ఈ సినిమాను ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో లాంటి సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

అంతేకాదు బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ పాట 'దంచవే మేనత్త కూతురా' అనే పల్లవినే ఈ సినిమాకు టైటిల్గా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇటీవల ఆడోరకం ఈడోరకం సినిమా సక్సెస్తో ఆకట్టుకున్న జి నాగేశ్వరరెడ్డి, ఈ శుక్రవారం సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఆటాడుకుందాం రా సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా ఇంట్లో దయ్యం నాకేం భయ్యం సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement