సీనియర్‌ హాస్య నటుడు మృతి

Comedy Actor Rocket Ramanathan Passes Away - Sakshi

సీనియర్‌ నటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ రాకెట్‌ రామనాథన్ (74) కన్నుమూశారు. తమిళంలో పలువురు నటులకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సుపరిచితుడైన రామనాథన్‌.. నటుడిగా  నామ్, స్పరిశం, మన్‌సోరు, కోవిల్‌యానై చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డును, నడిగర్‌ సంఘం నుంచి కలచ్ఛసెల్వం బిరుదును అందుకున్నారు.

రాకెట్‌ రామనాథన్‌కు భార్య భానుమతి, కొడుకు గురు బాలాజీ, కూతు రు సాయిబాల ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు. దక్షిణ భారత నటీనటుల సంఘం సంతాపం వ్యక్తం చేస్తూ ఒక లేఖను మీడియాకు విడుదల చేసింది. రాకెట్‌ రామనాథన్‌ భౌతిక కాయానికి బుధవారం సాయంత్రం కృష్ణాపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top