పవన్ సినిమా నుంచి మరొకరు అవుట్.? | Cinematographer Walks Out Of Katamarayudu | Sakshi
Sakshi News home page

పవన్ సినిమా నుంచి మరొకరు అవుట్.?

Sep 23 2016 12:31 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ సినిమా నుంచి మరొకరు అవుట్.? - Sakshi

పవన్ సినిమా నుంచి మరొకరు అవుట్.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో షాక్ ఇచ్చాడు. ఇప్పటికే తన కొత్త చిత్రం కాటమరాయుడు దర్శకుణ్ని మార్చేసిన పవన్ తాజాగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ను కూడా మార్చాడన్న...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో షాక్ ఇచ్చాడు. ఇప్పటికే తన కొత్త చిత్రం కాటమరాయుడు దర్శకుణ్ని మార్చేసిన పవన్ తాజాగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ను కూడా మార్చాడన్న టాక్ వినిపిస్తోంది.  ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు ముందుగా ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ అంటూ ప్రకటించారు. అయితే తాజాగా ప్రసాద్ మూరెళ్ల స్థానంలో సౌందర రాజన్ను తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో సర్థార్ గబ్బర్సింగ్ సమయంలో కూడా ముందుగా సంపత్ నందిని దర్శకుడిగా ప్రకటించిన పవన్, చివరి నిమిషంలో బాబీ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించాడు. కాటమరాయుడు విషయంలో కూడా అదే బాటలో ముందుగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో సినిమాను ప్రారంభించి తరువాత డాలీ దర్శకత్వంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆఖరి నిమిషంలో జరుగుతున్న ఈ మార్పులు సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement