‘బాహుబలి నా ముందు మోకాళ్లపై!’ | Chunky Panday on Working with Prabhas in Saaho | Sakshi
Sakshi News home page

‘బాహుబలి నా ముందు మోకాళ్లపై!’

Aug 27 2019 3:46 PM | Updated on Aug 27 2019 3:46 PM

Chunky Panday on Working with Prabhas in Saaho - Sakshi

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాహో ఫీవర్ నడుస్తోంది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలలోనూ ఈ సినిమాకు సంబంధించి భారీగా ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటులు పెద్ద సంఖ్యలో నటించిన ఈ సినిమాకు అక్కడ మీడియా కూడా మంచి కవరేజ్‌ ఇస్తోంది. తాజాగా సాహోలో నటించిన బాలీవుడ్ నటుడు చంకీ పాండే సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రభాస్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ‘ప్రభాస్‌ అంత వినయం ఉన్న స్టార్‌ హీరోను ఇంత వరకు చూడలేదు. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ముంబై నుంచి వచ్చిన నటులు షూటింగ్ పూర్తి చేసుకొని హోటల్స్‌కు వెళ్లే వరకు ప్రభాస్‌ సెట్‌ లోనే ఉండేవారు. ముఖ్యంగా సినిమాలో ఓ సన్నివేశంలో ప్రభాస్‌ నా ముందు మోకాళ్ల మీద కూర్చుంటాడు. అప్పుడు నాకు బాహుబలి నా ముందుకు మోకరిల్లినట్టుగా అనిపించింది’ అన్నారు.

ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన సాహో సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement