కృష్ణవంశీకి 'చిరు' కాల్ | Chiru's surprise call to Krishna Vamsi | Sakshi
Sakshi News home page

కృష్ణవంశీకి 'చిరు' కాల్

Aug 21 2016 8:15 PM | Updated on Sep 4 2017 10:16 AM

కృష్ణవంశీకి 'చిరు' కాల్

కృష్ణవంశీకి 'చిరు' కాల్

మెగాస్టార్ చిరంజీవి.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి సర్ప్రైజ్ కాల్ చేశారనే వార్త ఇప్పుడు సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది.

మెగాస్టార్ చిరంజీవి.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి సర్ప్రైజ్ కాల్ చేశారనే వార్త ఇప్పుడు సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. కృష్ణవంశీ తాజా చిత్రం 'నక్షత్రం'లో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అతిధి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వివరాలు తెలుసుకునేందుకే చిరు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. చిత్ర కథ, తేజు పాత్ర గురించి అడిగారట మెగాస్టార్. కథ విన్న తర్వాత బావుందంటూ మెచ్చుకున్నారట. స్వయంగా చిరంజీవి కాల్ చేయడం, కథ తెలుసుకుని బావుందంటూ కితాబునివ్వడంతో కృష్ణవంశీ బోలెడంత ఆనందంలో మునిగిపోయారు.

కాగా సోమవారం చిరంజీవి పుట్టినరోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరు 150వ సినిమాకు 'ఖైదీ నెంబరు 150' అనే టైటిల్ను కన్ఫామ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement