మరో మూవీకి సై అన్న మెగాస్టార్‌ అల్లుడు | Chiranjivi Son In Law Kalyan Dev Next Film Confirmed With Sreedhar Seepana | Sakshi
Sakshi News home page

మరో మూవీకి మెగాస్టార్‌ అల్లుడు రెడీ

Feb 5 2020 4:06 PM | Updated on Feb 5 2020 5:08 PM

Chiranjivi Son In Law Kalyan Dev Next Film Confirmed With Sreedhar Seepana - Sakshi

విజేత సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా స్టార్‌ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా మరో చిత్రం రాబోతుంది. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్‌ సమర్పణలో పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. విక్టరీ వెంకటేష్ నమో వెంకటేశ, మహేష్ బాబు దూకుడు వంటి చిత్రాలకు రచనా సహకారం అందించిన శ్రీధర్‌ సీపాన ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. (నవిష్క..వేడుక)

ఇటీవలే వెంకీ మామ వంటి ఘన విజయం సాధించిన చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫాక్టరీ, మరో చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలసి ఈ ఏడాది మార్చి నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీధర్‌ ఇప్పటికే అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం,సౌఖ్యం, డిక్టేటర్ వంటి పలు చిత్రాలకు కథ, మాటలు అందించిన విషయం తెలిసిందే. (‘సూపర్‌ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు )

ఈ సందర్భంగా శ్రీధర్‌ సీపాన మాట్లాడుతూ..‘రచయితగా నాకున్న అనుభవంతో ఓ మంచి కథను దర్శకునిగా పరిచయం కావటానికి సిద్ధం చేసుకున్నాను. ఈ కధకు హీరో కళ్యాణ్ దేవ్ సరైన నాయకుడని అనిపించింది. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కధా చిత్రంగా దీనికి రూపకల్పన చేయటం జరిగింది. హీరో పాత్ర ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దర్శకునిగా నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు కృజ్ఞతలు. వారి గౌరవాన్ని పెంచే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తానని నమ్మకంగా చెప్పగలను’ అని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర నటీనటులను, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో ప్రకటిస్తామని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement