Chirajeevis's Sye Raa Narasimha Reddy Trailer 2, War Against British | సైరా : మరో ట్రైలర్‌ - Sakshi
Sakshi News home page

సైరా : మరో ట్రైలర్‌

Sep 26 2019 10:37 AM | Updated on Sep 26 2019 3:47 PM

Chiranjeevi Sye Raa Narasimha Reddy Second Trailer Released - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌లకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెంచేస్తూ మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఈ ట్రైలర్‌ అభిమానుల్లో అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. యాక్షన్‌ సీన్స్‌లో చిరు లుక్స్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి.

ఈ ట్రైలర్‌లో చిరుతో పాటు సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు పాత్రలను కూడా ప్రధానం చూపించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా లేడీ సూపర్‌ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement